Samantha : చిరంజీవి నుండి ఫోన్ కాల్ రావడంతో షాక్ అయిన సమంత..??

Authored By Breaking News | The Telugu News | Published on: November 12, 2022, 9:40 pm

Samantha : మెగాస్టార్ చిరంజీవి వరుస పట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేశారు. ఏప్రిల్ నెలలో ఆచార్య, అక్టోబర్ నెలలో గాడ్ ఫాదర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండిటిలో గాడ్ ఫాదర్ తో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఇండస్ట్రీ మేలు కోరుతూ పలు మంచి పనులు చేస్తూ ఇంకా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.

దీనిలో భాగంగా ఇటీవల సమంత ఆరోగ్యం బాలేదని మయోసిటీస్ అని అరుదైన వ్యాధికి గురికావడం పట్ల సోషల్ మీడియాలో చిరంజీవి రియాక్ట్ కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమంతకి నేరుగా చిరంజీవి ఫోన్ చేయటంతో… ఆమె షాక్ అయినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సమంత టైటిల్ పాత్ర పోషించిన “యశోద” శుక్రవారం థియేటర్ లో విడుదల కావడం జరిగింది. సినిమా అద్భుతంగా ఉన్నట్లు పాజిటివ్ టాక్ రావడం జరిగింది. చాలామంది సినిమాలో సమంత నటన పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

samantha is to receive a phone call from chiranjeevi

samantha is to receive a phone call from chiranjeevi

అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నేరుగా సమంతకి ఫోన్ చేసి… అభినందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి మరి తెలుసుకొని మరోసారి సమంతకి ధైర్యం చెప్పినట్లు మీడియా సర్కిల్స్ లో విశ్వసనీయ వార్త. ఇండస్ట్రీలో ఏదైనా సినిమా హిట్ అయింది అంటే కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి నుండి సదరు సినిమా యూనిట్ కి ఫోన్ కాల్ వెళ్తుంది. ఈ తరహాలోనే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమంతకి “యశోద” సినిమా విజయం సాధించటం పట్ల అభినందించి.. త్వరగా కోలుకోవాలని స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి చెప్పటంతో షాక్ లో సమంత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp