Home » Entertainment » Samantha Last Workout Video161007
Entertainment

Samantha : బరువులను అవలీలగా ఎత్తేస్తున్న సమంత .. ఇదే చివరి వర్కౌట్ వీడియో..

Authored By
Anusha V
The Telugu News | Updated on: December 31, 2023, 2:04 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. ఇక సమంతకు వర్కౌట్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. షూటింగులో ఉన్న ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా సమంత మాత్రం డైలీ వర్కౌట్స్ ఎప్పుడు మిస్ అవ్వరు. ఎప్పటికప్పుడు తన వర్కౌట్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. అంతేకాదు తాను చివరిగా చేస్తున్న వర్కౌట్ ఇదే అంటూ పోస్ట్ కూడా పెట్టారు. అంటే దాని అర్థం సమంత ఇకనుంచి వర్కౌట్స్ మానేస్తుందని కాదు. 2023 కి గుడ్ బై చెప్పి 2024 కి చెప్పబోతున్నాం కదా. సమంత కూడా న్యూ ఇయర్ కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇయర్ ఎండింగ్ ను తన వర్కౌట్స్ తో ముగించింది. వెయిట్ లిఫ్టింగ్ చేసి 2023 ఏడాదిని ముగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో సమంత నేవీ బ్లూ స్పోర్ట్స్ బ్రా గ్రే హై వేటింగ్ టైర్స్ ధరించారు.

ఇందులో సమంత ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ ఎక్ససైజ్ చేస్తున్నారు. ఈ ఎక్ససైజ్ వలన భుజం కండరాలు బలంగా, పెద్దవిగా అవుతాయి. అలాగే ట్రై స్టెప్స్ ట్రాపిజిఎస్ కండరాల బలానికి ఈ ఎక్సర్సైజ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఇదే వీడియోలో సమంత పక్కనే తన పెట్టి డాగ్ కూడా ఉంది. ప్రస్తుతం సామ్ వర్కౌట్ వీడియో నెటిజెన్స్ తెగ ఆకట్టుకుంటుంది. ఇకపోతే సమంత చివరిగా ‘ ఖుషి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. త్వరలో ‘ సీటాడెల్ ‘అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సీటాడెల్ కి ఫ్రీక్వల్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ వెబ్ సిరీస్త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల కానుంది.

Advertisement

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి