Samantha : సమంతని ఇలా చూడడం ఎవరి వల్ల అన్నా అవుతుందా ?
Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత త్వరలో ‘ ఖుషి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మనకు తెలిసిందే సమంత ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో లవ్ స్టోరీ ఉన్న సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో సమంతని ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. ఇప్పటికీ సమంత నటించిన ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా వస్తే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే లవ్ స్టోరీ లో ఒకప్పటి సమంత అంటే చూడగలం కానీ ఇప్పుడు ఆమెను అలా చూడగలరా అంటూ చెప్పుకొస్తున్నారు.సమంతకు మధ్యలో కొన్ని వ్యక్తిగత సమస్యలు వచ్చాయి. వాటి వల్ల తను చాలా ఎఫెక్ట్ అయింది. అంతేకాదు ఇటీవల యశోద, శాకుంతలం లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. అంతకుముందు బాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో విలన్ గా కూడా చేసింది. కెరీర్ పరంగా ఇన్ని షేడ్స్ చూపిస్తున్న సమంత మళ్లీ లవ్ స్టోరీ లో నటించడం ఏమంత కిక్ అనిపించదు అని జనాలు భావిస్తున్నారు. అయితే శివ నిర్వాణ కథ కథనంలో మ్యాజిక్ ఉంటే మాత్రం ఖుషి సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన నా రోజా నువ్వే సాంగ్ సూపర్ హిట్ అయింది.
దీంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని జనాలు భావిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాఫ్ తర్వాత ఖుషి సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ రౌడీ స్టార్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక సమంత శాకుంతలం సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. మరీ ఖుషి సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.