Samantha : గంటల వ్యవధిలోనే స‌మంత ఫొటోకి లక్షల్లో కామెంట్స్​, లైక్స్​.. ఏ ఫొటోకి తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: May 3, 2022, 11:00 am

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ అందాల స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత ఈ అమ్మ‌డు చేసే పోస్ట్‌లు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా, క్యూట్ హీరోయిన్‌గా పేరున్న సమంత అలియాస్ సామ్ ఏం చేసినా హల్‌చలే. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అందం..అభినయం సొంతం చేసుకున్న సమంతా రూత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ఫిట్​నెస్ వీడియోలు, కొటేషన్స్​, ప్రమోషనల్ బ్రాండ్స్​ తదితర పోస్ట్​లు షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా సామ్​ పెట్టిన పోస్ట్​ చూసి తన అభిమానులు మురిసిపోతున్నారు.తాజాగా సమంత వైట్ ఫ్లవర్స్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో షేర్ చేసింది. వయసు పెరిగే కొద్దీ ఆలోచన స్థాయి కూడా పెరుగుతోంది అని అర్థం వచ్చేలా సామ్ ఈ పిక్ కి కామెంట్ పెట్టింది. ఈ ఫొటోకి సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ మోత మోగిస్తున్నారు. 24 గంటలు గడవక ముందే ఈ పోస్ట్ కి మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఇటీవల సమంత తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన పిక్ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ ఫోటోకి హీరోయిన్ కావ్య థాపర్, స్టైలిస్ట్ ప్రీతం లాంటి సెలెబ్రిటీలు రియాక్ట్ అయ్యారు.

samantha latest pic viral in social media

samantha latest pic viral in social media

Samantha : స‌మంత క్యూట్ పిక్

ఇటీవల సమంత 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే అదే రోజు ఏప్రిల్​ 28న సామ్​ నటించిన ‘కణ్మనీ రాంబో ఖతీజా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. ఇక సమంత నటించిన అసలైన చిత్రాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా మూవీ ‘యశోద’ ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీ కూడా రిలీజ్‌కి సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమాల‌తో స‌మంత క్రేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  2. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  3. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  4. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

  5. "OM Movie Review : ధనుష్, మమ్ముట్టి ఓం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  6. "Gold Price Today : బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. 10 గ్రాములు రూ.95 వేల కంటే తక్కువే!"

  7. "Adinarayana Reddy : కడప జిల్లా రాజకీయాల్లో పెను భూకంపం.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ఫిక్స్?!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp