Samantha: పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో స‌మంత‌ లేటెస్ట్ క్యూట్ పిక్స్..ఇలాంటి ఫోజులిస్తే మతులుపోక ఏమవుతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha: పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో స‌మంత‌ లేటెస్ట్ క్యూట్ పిక్స్..ఇలాంటి ఫోజులిస్తే మతులుపోక ఏమవుతుంది

 Authored By govind | The Telugu News | Updated on :16 September 2021,8:20 pm

Samantha: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే అందరినీ తన మాయలో పడేసింది. ప్రేక్షకులను మాత్రమే కాదు, అక్కినేని నాగ చైతన్యను సైతం తన మాయలో పడేసింది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన స‌మంత అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమా సక్సెస్ తర్వాత అన్నీ భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

samantha latest pink colour dress cute pics going viral

samantha-latest-pink-colour-dress-cute pics-going-viral

ఈ క్రమంలో వ‌ర‌సుగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది సమంత. తెలుగు, త‌మిళంలో వ‌రుస అవకాశాలు, సక్సెస్‌లు సమంత వద్దకి చేరడం విశేషం. కమర్షియల్ హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీ సాధించింది. నాగ చైత‌న్య‌ను పెళ్ళి చేసుకోక ముందు ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే పెళ్ళి తర్వాత మాత్రం కేవలం కథా బలమున్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. ఒక వైపు సినిమాలు, మరొక వైపు వెబ్ సిరీస్‌లు, మధ్యలో షోస్‌తో ఫుల్ బిజీగా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.

 

Samantha: త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

ఇటీవ‌ల ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది సమంత. రాజీ పాత్రలో సమంత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ లో అవకాశాలు వస్తున్నాయట. ఇందులో భాగంగానే తాజాగా ఓ మూవీకి సైన్ చేసినట్టు సమాచారం. దానికి సంబంధించిన ఫొటో షూట్ జరిగిందట.

ఇక్కడున్న పింక్ డ్రెస్ కలర్ పిక్స్ దీనికి సంబంధించినవే. బాలీవుడ్ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. అయితే తాజాగా ఫొటోస్‌లో మాత్రం సమంత చాలా క్యూట్‌గా ఉంది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది