Samantha : ఇంత బరువు ఎలా మోస్తుందో… సమంత జిమ్ వీడియో వైరల్
Samantha : స్టార్ హీరోయిన్ టాలెంటెడ్ బ్యూటీ సమంత ఏమాయ చేశావే అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే సామ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.కెరీర్ ఆరంభంలోనే సమంత వరుస పెట్టి సినిమాలు చేసింది.
అందులో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ ఉండేవి. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె తన పంథాను పూర్తిగా మార్చుకుంది. మధ్యలో వచ్చిన గ్యాప్‌ను పూడ్చేందుకు వరుసగా సినిమాలు చేయడంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే చేస్తోంది. దీంతో ఆమె కెరీర్ మరోసారి ఊపందుకుందనే చెప్పాలి.తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

Samantha latest workout video goes viral
దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న కాతు వాకుల్ రెండు కాదల్ అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసేసుకుంది. ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు యశోద అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.అయితే సమంత హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రెచ్చగొడుతోంది. పొట్టి డ్రెస్ లలో మతిపొగొడతోంది. తాజాగా సమంత ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్పోర్ట్స్ బ్రాతో పాటు టైట్ షార్ట్ ధరించి ఉంది. భారీ వెయిట్ లిఫ్టింగ్ చేసి షాకిచ్చింది. ఈ వీడియోలో సమంత అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram