Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. మళ్లీ మళ్లీ అవే పంచ్ లు.. అవే స్కిట్స్
Sudigali Sudheer : జబర్దస్త్ కార్యక్రమం పై ప్రేక్షకులకు మొహం మొత్తుతున్నట్లుగా అనిపిస్తుంది. గత పది సంవత్సరాలుగా జబర్దస్త్ కార్యక్రమం కామెడీ తో నవ్వించింది. ఇప్పటికి కూడా కామెడీతో నవ్వించే ప్రయత్నం అయితే చేస్తుంది కాని అది వర్కౌట్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు స్పెషల్ స్కిట్ లు.. కొత్త టీమ్ ల పేరుతో కొత్త కొత్త వారిని తీసుకు వచ్చి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరగడం లేదు అంటూ ఈమద్య మల్లెమాల వారు కూడా స్వయంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా ఫలితం కనిపించడం లేదు. ఎప్పటిలాగే నిన్నటి జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా సుడిగాలి సుధీర్ టీమ్ కామెడీ ఉంది. నవ్వు తెప్పించే విధంగా అయితే ఉంది కాని.. కొత్తగా ఏమీ లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడు చూసినా అదే తరహా కామెడీ.. అదే తరహా పంచ్ లు తప్ప మరేం కొత్తవి వారికి దొరకడం లేవా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ టీమ్ పై ఇప్పటికే విమర్శలు ఓ రేంజ్ లో వస్తున్నాయి.

jabardasth sudigali sudheer and team comedy this week
ఇలాంటి సమయంలో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం మాత్రం శూన్యం అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మల్లెమాల వారి నుండి ఆశించిన సహకారం అందడం లేదు అంటూ జబర్దస్త్ టీమ్ మెంబర్స్ అంటున్నారు. ఇలాంటి సమయంలో వారు చేసే కామెడీ కూడా ప్రేక్షకులకు కొత్తదనం ను అందించలేక పోతుంది. అందుకే జబర్దస్త్ కార్యక్రమం పై అంచనాలు ఆసక్తి జనాల్లో తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఈ సమయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే తప్ప కాస్త రేటింగ్ పెరగడం కష్టం.