Samantha : అల్లు అర్జున్ మీద‌కు ఎక్కి స‌మంత ర‌చ్చ‌.. ఊ అంటావా మావ ఊఊ అంటావ మావ‌..వీడియో సాంగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : అల్లు అర్జున్ మీద‌కు ఎక్కి స‌మంత ర‌చ్చ‌.. ఊ అంటావా మావ ఊఊ అంటావ మావ‌..వీడియో సాంగ్

 Authored By sandeep | The Telugu News | Updated on :7 January 2022,5:50 pm

Samantha : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప‌. డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లైన ఈ చిత్రం టాప్ గ్రాసర్ ఆఫ్ 2021గా నిలిచి బాలీవుడ్ సినిమాల‌కే స‌వాలు విసిరింది. సినిమాలో బ‌న్నీ న‌ట‌న‌, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం, సుకుమార్ డైరెక్ష‌న్, స‌మంత ఐటెం సాంగ్ మూవీని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. అయితే స‌మంత తొలి సారి ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయ‌డంతో అంద‌రి దృష్టి ఈ మూవీపై ప‌డింది. పాట‌లో స‌మంత త‌న గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ ‘ఊ అంటావా మావ .. ’ అంటూ అల్లు అర్జున్‌తో క‌లిసి ర‌చ్చ చేసింది.

ఇటు ఫ్యాన్స్‌.. అటు మాస్ ఆడియెన్స్ ఊగిపోయారు.‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టు కునేలా పాడింది. ‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌‌‌‌‌‌‌‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్. ఈ సాంగ్‌పై ఎన్ని వివాదాలు అలుముకున్నా కూడా సాంగ్ మాత్రం యూట్యూబ్ లో ర‌చ్చ చేసింది.

samantha mass song in Allu Arjun pushpa Movie

samantha mass song in Allu Arjun pushpa Movie

Samantha : స‌మంత మాస్ సాంగ్ వీడియో విడుద‌ల‌

రీసెంట్‌గా ఈ సాంగ్ కోసం స‌మంత ఎంత‌గా క‌ష్ట ప‌డింది అనే దానికి సంబంధించిన రిహార్స‌ల్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పాట‌లో స‌మంత చాలానే క‌ష్ట‌ప‌డింది. కొరియోగ్రాఫ‌ర్ చుక్క‌లు చూపించాడంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక తాజాగా సినిమాలో బ‌న్నీతో డ్యాన్స్ చేసిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో స‌మంత బ‌న్నీపైకి ఎక్కి ర‌చ్చర‌చ్చ చేసింది. వీరిద్ద‌రి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. కాగా, ఈ పాట కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది