
Samantha Emotional Post
Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ ముద్దుగుమ్మ ఇటీవల నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి తెగ వార్తలలో నిలుస్తుంది. కొన్నేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటై.. ఇటీవలే విడాకులు తీసుకున్నారు టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. సినిమాల ద్వారా ప్రేమలో పడిన వీళ్లిద్దరూ వివాహ బంధం మొదలైన తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యలో ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఇలా కొద్ది నెలల పాటూ వేరు వేరుగా ఉంటూ వచ్చిన చై సామ్.. గత అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
విడాకుల తర్వాత సమంత సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు తమిళ హీరో కార్తీ సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టు సమాచారం. కార్తీ తమిళంతో పాటు తెలుగులోను ప్రత్యేక అభిమాన గణాన్ని ఏర్పరచుకున్నాడు. ఖైదీ సినిమాతో ఒక్కసారిగా కార్తీ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఖైదీ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకోలేకపోయాడు. చినబాబు అంటూ ఓ మాదిరి విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు కార్తీ.. సమంతతో కలిసి సరికొత్త ప్రయత్నం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
samantha may as female lead in karthi film
సమంత ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో స్టార్ అయిపోయింది. తమిళ, తెలుగు చిత్రాలు చేస్తూ ఉన్నా కూడా సమంత మాత్రం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీ సినిమాకు ఓకే చెబుతుందా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా, ఈ సినిమా కోసమే సమంతను తీసుకోవాలని చర్చిస్తున్నారట. మరి ఈ సినిమా కోసం సమంత డేట్స్ కేటాయిస్తుందా లేదా, అనేది చూడాలి.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.