Samantha : సమంత, నాగచైతన్య ఆడియో క్లిప్ వైరల్.. సమంత ఏమన్నదంటే..?

Authored By mallesh | The Telugu News | Published on: December 10, 2021, 5:40 pm

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్‌లో సమంత, నాగచైతన్య విడాకుల విషయంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరిద్దరు విడిపోయి నెలలు గడుస్తున్నా.. దీనికి సంబంధించిన వార్తలు ఇంకా సోషల్ మీడియాలో హల్ చల్ అవుతూనే ఉన్నాయి. ఏమాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సామ్.. ఈ మూవీతో అందరి మనసులను గెలుచుకుంది. అప్పటి వరకు హిట్ కోసం పరితపిస్తున్న నాగచైతన్యకు ఈ మూవీతో బ్రేక్ దొరికింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఆటోనగర్ సూర్య, మజిలి వంటి మూవీస్ వచ్చాయి.

ప్రేమలో పడిన వీరిద్దరూ పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు. అంతా సాఫీగా సాగుతుండగా ఒక్క సారీగా వీరు విడాకులు తీసుకుంటున్న విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ విషయంలో మొదట్లో వీరిద్దరూ స్పందించలేదు. తర్వాత సామ్ తన పేరు మందు నుంచి అక్కినేని అని తీసేయడంతో వారి ఫ్యాన్స్ కొంత డైలమాలో పడ్డారు. ఆ తర్వాత విడిపోతున్నట్టు వీరిద్దరు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఎవరి సినీ కెరీర్ పై వారు దృష్టి పెట్టారు.టాలీవుడ్

samantha nagachaitanya audio clip viral

samantha nagachaitanya audio clip viral

Samantha : ఆడియో క్లిప్ వైరల్

ఈ టైంలో సమంతకు కాల్ చేయాలని నాగచైతన్యను ప్రదీప్ రిక్వెస్ట్ చేశాడు. దీంతో సామ్ కు ఫోన్ చేశాడు చైతు.. సమంతతో మాట్లాడుతూ ప్రపంచం‌లో ఇంత మంది అమ్మాయిలుండగా నిన్నే నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను అని ఏమాయ చేసావే మూవీ స్టైల్‌లో సమంతను అడుగుతాడు. దీని సమంత రెస్పాండ్ అవుతూ నీకు నేను ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి.. అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ కాల్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ మూవీ చై కెరీర్‌లోనే మంచి హిట్ మూవీగా నిలిచింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp