నాగ చైతన్య గుండెల్లో గుబులు పుట్టించే న్యూస్ : సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

నాగ చైతన్య గుండెల్లో గుబులు పుట్టించే న్యూస్ : సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే !

 Authored By aruna | The Telugu News | Updated on :30 June 2023,9:00 am

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక మొదటి సినిమా తోనే నాగచైతన్య తో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాలను ఒప్పించి ఇద్దరు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళ జంట గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యేది. చూడడానికి వీళ్లిద్దరి జంట బాగుండడంతో అభిమానులు కూడా ఎంతో లైక్ చేసేవారు. అయితే ఎవరు ఊహించని విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. పట్టుమని పదేళ్లు కూడా కాపురం చేయకుండానే సమంత నాగచైతన్య పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు.

ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక వీళ్ళు విడాకులు తీసుకుని తర్వాత నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా సినిమాల పరంగా సమంత నాగచైతన్య బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ మధ్య నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు సమంత ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అతడు సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కావచ్చు అని ప్రచారం జరుగుతుంది.

Samantha new boyfriend pics

Samantha new boyfriend pics

మనకు తెలిసిందే సమంత బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్లలో నటిస్తుంది. ఇప్పుడు ఆమె సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్లారు. అయితే షూటింగ్ ముగిశాక అతనితో సమంత కనిపిస్తున్నారు. ఆమె ప్రవర్తన అనుమానాలకు దారితీస్తుండగా ఆమె ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక సమంత తెలుగులో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ ఖుషి ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది