Home » Entertainment » Samantha New Movie Announcement After Her Divorce
Entertainment

Samantha : విడాకుల తర్వాత సమంత కొత్త అడుగు..!

Authored By
aruna
The Telugu News | Updated on: October 20, 2021, 3:34 pm
Advertisement

Samantha కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఒక్కటే డిస్కషన్ పాయింట్.. అదే నాగ చైతన్య- సమంత డివోర్స్. ఎన్నో ఆశలతో అక్కినేని వారింట అడుగుపెట్టిన సమంత ఆ బంధాన్ని నాలుగేళ్ల లోపే తుంచేసుకుంది. సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించి షాకిచ్చారు. అక్టోబర్ 2న దీనిపై క్లారిటీ రాగా.. నేటికీ ఈ అంశం జనాల్లో హాట్ టాపిక్ గానే నడుస్తోంది.మరోవైపు చై- సామ్ ఇద్దరూ వేరువేరుగా ఉంటూనే తమ తమ కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు. విడాకుల తాలూకు విషయాలు పెద్దగా పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి పెడుతున్నారు.

Advertisement

ఈ విషయంలో నాగ చైతన్య కంటే సమంతే ముందుంది. చైతూతో విడాకులు కన్ఫర్మ్ చూసుకున్నాక ఇప్పటికే ఎన్టీఆర్ షోలో పాల్గొన్న సామ్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది.తాను రాణించాలనుకునే సినిమా రంగంలో ఇకపై దూసుకుపోవాలని భావిస్తోందట సమంత. ఈ మేరకు చైతూకి సంబంధించిన జ్ఞాపకాల నుంచి బయటకొచ్చేసి ఓ సినిమాను కన్ఫర్మ్ చేసేసింది.

Samantha

Advertisement

Samantha ఇకపై సమంత అలా

Samantha New Movie Announcement After her Divorce

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్ 30గా రాబోతోన్న ఓ సినిమాలో సమంత నటించబోతోంది. ద్విభాషచిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాతో శంతనురుబన్ జ్ఞానశేఖరన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. దసరా కానుకగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు వదిలిన పోస్టర్‌లో సమంతను చూస్తే ఎంతో బాధలో ఉన్నట్టు కనిపిస్తోంది. అతి త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి