Samantha : ఒకప్పుడు అలా ఉండేవాళ్లం.. అసలు విషయం చెప్పిన సమంత

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 3 November 2021, 3:50 pm

Samantha : సమంత ఇప్పుడు తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. విడాకుల అనంతరం విడాకులకు ముందు సమంత లైఫ్ ఒకేలా ఉంది. ఏ మాత్రం మారలేదు. విడాకులకు ముందు కూడా సమంత తన ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా ఉండేది. సాధన సింగ్, ప్రీతమ్ అంటూ వాళ్లతోనే గడిపేది. ఇక ఇప్పుడు కూడా అలానే ఉంటోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు కూడా అలానే తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.

samantha

samantha

అక్టోబర్ నెలలో విడాకులు.. ఆ తరువాత ఛార్ ధామ్ యాత్ర.. అటుపై దుబాయ్ ట్రిప్ ఇలా ఆ నెల అంతా కూడా సమంత ఫుల్ బిజీగా గడిపింది. ఇక ఛార్ ధామ్ యాత్రను, అక్కడి విశేషాలను సమంత రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ వచ్చింది. దుబాయ్ విశేషాలు, అక్కడి వీధుల్లో తిరగడం, అక్కడి రెస్టారెంట్లు, ఫుడ్ గురించి ఎప్పటికప్పుడు సమంత చెబుతూ వచ్చింది. మొత్తానికి సమంత ఇప్పుడు హైద్రాబాద్‌లోకి అడుగుపెట్టేసినట్టు అనిపిస్తోంది.

Samantha : సాధనకు సమంత రిప్లై..

samantha

samantha

తాజాగా సాధన సింగ్ ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ వీడియో ఉంది. 2003లో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసిన వాళ్లు.. 2021లో మత్రం ఎంతో బుద్దిగా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. ఆ వీడియోను సమంతకు ట్యాగ్ చేసింది సాధన. మనం కూడా ఇలాంటి వాళ్లమేనా? ఒకప్పుడు అలానే ఉండేవాళ్ల కదా? అన్నట్టుగా ప్రశ్నించింది. అయితే సమంత కూడా ఈ వీడియోను షేర్ చేసింది. అంటే సమంత కూడా అలానే ఒకప్పుడు ఫుల్లుగా ఎంజాయ్ చేసిందన్నమాట.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి