Home » Entertainment » Samantha Post About Kashmir
Entertainment

Samantha : నిన్ను త‌ల‌చుకుంటే పెదాల‌పై న‌వ్వు వ‌స్తుందంటూ స‌మంత షాకింగ్ పోస్ట్

Authored By
Sam C
The Telugu News | Published on: May 22, 2022, 10:00 pm
Advertisement

samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ ర‌చ్చ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత ఈ అమ్మ‌డి హంగామా పీక్స్ లో ఉంది. ఈ అమ్మ‌డు ఒక‌వైపు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌లో ర‌చ్చ చేస్తుంది. రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత జోడి ‘ఖుషి’ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది. ‘మహానటి’ మూవీలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరు.. మరోసారి జంటగా నటిస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీని డిజైన్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి క్రేజ్ ద‌క్కింది.

Advertisement

కాశ్మీర్ లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, ఈ సినిమా షూటింగ్ ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాశ్మీర్ అందాల గురించి పోస్ట్ పెట్టింది. అక్కడ ప్రకృతి అందాలను చూసి సామ్ మనపు పారేసుకుంది. కాశ్మీర్‌ను ఎప్పుడు తలచుకున్న తన పెదవులపై చిరునవ్వు విరబూస్తుందని చెప్పుకొచ్చింది. కాశ్మీరి ప్రజల జీవనశైలి తెలిసేవిధంగా అక్కడి ఫొటోలను ఆమె పంచుకుంది. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో సమంత సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా, విజయ్‌ దేవరకొండ స్టైలిష్‌ అబ్బాయిగా నటిస్తున్నట్లు తెలుస్తోందిచైతూతో డివోర్స్ తర్వాత ఇంకాస్త జోరు పెంచిన సమంతా.. ఇప్పుడు రూటు మార్చి టాప్ గేర్ వేసింది.

samantha post about kashmir

Advertisement

బాలివుడ్ హీరోయిన్స్ కి టప్ కాంపిటీషన్ ఇచ్చేందుకు ఒక పక్క రెడీ అవుతోంది. మరో పక్క ఓ డెబ్యూ డైరెక్టర్ తో భారీ నిర్మాణ సంస్థలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇతర నటీనటులతో పాటు సాంకేతిక వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మొన్నటిదాక సినిమాలు, పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్న స్యామ్.. పుష్ప లో ఊ అంటావా మామా ఐటమ్ సాంగ్ చేయడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకుంది.ఈ క్ర‌మంలో బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇస్తున్న ప్రతి ఆఫర్ ని స్యామ్ ఓకే చేస్తుందట. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్స్.. రాజ్ అండ్ డీకేతో మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి