Samantha : ప్రీతమ్‌తో కలిసి సమంత కొంటె చేష్టలు.. వీడియో వైరల్
Samantha : సమంత, ప్రీతమ్ జుకల్కర్, సాధన సింగ్‌లు ఎంతో క్లోజ్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమంత చేసే పనుల్లో సాధన, ప్రీతమ్‌ల హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది. సమంత తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయగల అతి కొద్ది మంది స్నేహితుల్లో సాధన, ప్రీతమ్ ముందుంటారు. వీరు ముగ్గురూ దాదాపు కలిసే ఉంటారు. ఒకే చోట ఉంటారు. ఇక విడాకుల విషయంలోనూ సమంతను ప్రభావితం చేసింది, ఉసిగొల్పింది ఈ స్నేహితులేనన్న అపవాదు కూడా ఉంది.
అయితే సమంత మాత్రం తన ఫ్రెండ్స్‌తోనే ఉంటుంది. నాగ చైతన్యతో విడిపోయానన్న బాధను ఎక్కడా చూపించడం లేదు. హ్యాపీగా తన గ్యాంగుతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. పైగా టూర్లు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ముగ్గురూ కూడా చెన్నైలో ఉన్నారు. గత రాత్రి నయనతార బర్త్ డేను అంతా కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది.

Samantha Preetham Jukalker Fun WIth Sadhna Singh
Samantha ప్రీతమ్ సమంత రచ్చ రచ్చ..
అయితే సమంత, ప్రీతమ్‌లు కొంటె చేష్టలు చేశారు. సాధన సింగ్‌ను రకరకాలుగా తయారు చేశారు. సాధన సింగ్‌కు సమంత, ప్రీతమ్ కలిసి మేకప్ వేశారు. ఆమెను దారుణంగా రెడీ చేశారు. లిప్స్, ఐస్, మొహం మొత్తాన్ని నాశనం చేశారు. చిన్న పిల్లలు ఆడుకుంటే ఎలా చేస్తారో అంతా గందరగోళం చేసి సాధన మొహాన్ని నాశనం చేసేశారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
MUA in the making, @Samanthaprabhu2 uses eyeshadow on her friend’s lip cause WHY NOT ????#Samantha #SamanthaRuthPrabhu #Tollywood #TollywoodActress #Kollywood #Bollywood #Makeup #MUA pic.twitter.com/BfMao9PMfC
— Hyderabad Times (@HydTimes) November 18, 2021