పుష్ప
Samantha : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప విడుదల ముందు సంచలనాలు సృష్టిస్తోంది. రష్మిక కథానాయికగా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ను తీసుకొచ్చాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన సమంత ఐటమ్ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. సామ్ మొదటి సారిగా నర్తించబోతున్న ఈ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైన కొద్ది గంటల నుంచే మిలియన్ వ్యూస్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది.పుష్ప నుంచి విడుదలైన ఆఖరి సాంగ్ ఊ అంటావా మావ… ఊఊ అంటావా మావ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియో రికార్డులు క్రియేట్ చేస్తూ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేస్తోంది.
దర్శకుడు సుకుమార్ యాపిల్ బ్యూటీతో మాస్ మసాలా బీట్‌లో డాన్స్ నంబర్ చేయించి నెట్టింట రచ్చ క్రియేట్ చేశారు. వీడియో విడుదలైన 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ రాబట్టడమే గాక 634K లైక్స్ సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. దీంతో పాటు… సౌతిండియాలోనే తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డు కైవసం చేసుకుంది. ఇదే విషయాన్ని స్పెషల్ పోస్టర్‌తో పుష్ప చిత్ర బృందం ప్రకటించగా.. దానికి సమంత, హౌ కూల్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పాట టాప్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు స్టిల్స్ తోనే అదరగొట్టిన సమంత… డ్యాన్స్ లో ఇంకెంత రచ్చ చేస్తుందోనని అటూ బన్నీ అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
samantha pushpa movie item song create New records in youtube
ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాటకు… చంద్రబోస్ రాసిన లిరిక్స్, దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బాణీలు, అందుకు తగ్గట్లు ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన.. దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డా ఇది నా అడ్డా పాటలు ఇప్పటికే అభిమానులను ఓ ఊపు ఊపేశాయి.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.