Samantha : సమంత హాట్ స్టిల్స్ కి సౌత్ ఇండియన్స్ ఫిదా… ఊ అంటావా మావ.. అంటూ నెట్టింట్లో రికార్డులు!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 13, 2021, 9:40 am

Samantha : అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్‌ పుష్ప విడుదల ముందు సంచలనాలు సృష్టిస్తోంది. రష్మిక కథానాయికగా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ను తీసుకొచ్చాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన సమంత ఐటమ్‌ సాంగ్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. సామ్ మొదటి సారిగా నర్తించబోతున్న ఈ స్పెషల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదలైన కొద్ది గంటల నుంచే మిలియన్ వ్యూస్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది.పుష్ప నుంచి విడుదలైన ఆఖరి సాంగ్ ఊ అంటావా మావ… ఊఊ అంటావా మావ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియో రికార్డులు క్రియేట్ చేస్తూ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేస్తోంది.

దర్శకుడు సుకుమార్ యాపిల్ బ్యూటీతో మాస్ మసాలా బీట్‌లో డాన్స్ నంబర్ చేయించి నెట్టింట రచ్చ క్రియేట్ చేశారు. వీడియో విడుదలైన 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్‌ రాబట్టడమే గాక 634K లైక్స్ సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. దీంతో పాటు… సౌతిండియాలోనే తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డు కైవసం చేసుకుంది. ఇదే విషయాన్ని స్పెషల్ పోస్టర్‌తో పుష్ప చిత్ర బృందం ప్రకటించగా.. దానికి సమంత, హౌ కూల్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పాట టాప్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు స్టిల్స్ తోనే అదరగొట్టిన సమంత… డ్యాన్స్ లో ఇంకెంత రచ్చ చేస్తుందోనని అటూ బన్నీ అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

samantha pushpa movie item song create New records in youtube

samantha pushpa movie item song create New records in youtube

samantha : ఊ అంటావా మావ.. అంటూ రెచ్చిపోయిన సమంత..!

ఊ అంటావా.. ఊ ఊ అంటావా పాటకు… చంద్రబోస్ రాసిన లిరిక్స్, దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బాణీలు, అందుకు తగ్గట్లు ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన.. దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డా ఇది నా అడ్డా పాటలు ఇప్పటికే అభిమానులను ఓ ఊపు ఊపేశాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp