Home » Entertainment » Samantha Reaction About Naga Chaitanya
Entertainment

Samantha : నాగ చైతన్య సినిమా షూటింగ్ క్యాన్సల్ అయింది అని తెలుసు సమంత రియాక్షన్ ఇదే

Authored By
Sam C
The Telugu News | Updated on: October 10, 2022, 8:42 pm
Advertisement

Samantha : జయాపజాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ బిజీగా ఉండే హీరో నాగ చైతన్య. ఇప్పుడు కూడా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగార్రాజు, థాంక్యూ, లాల్ సింగ్ చెడ్డ సినిమాలతో వచ్చాడు నాగ చైతన్య. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ విషయం తెలిసి సమంత తన సన్నిహితులతో ఒక వెరైటీ రియాక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రూల్స్ బ్రేక్ చేసినందుకు చైతు సినిమా ఉన్నఫలంగా ఆపేశారు. అంతేకాదు వాళ్ళ షూటింగ్ యూనిట్ పై దాడి కూడా జరిగింది. థాంక్యూ సినిమా తర్వాత చాలా బ్రేక్ తీసుకున్న నాగ చైతన్య..

Advertisement

ఈ మధ్యే వెంకట్ ప్రభుతో కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. దీనిపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు నాగ చైతన్య. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. బంగార్రాజు తర్వాత మరోసారి ఇద్దరు జంటగా నటిస్తుండడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. పైగా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే వార్తలు సోషల్ మీడియాలో చాలా రోజులుగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. షూటింగ్ కోసం వచ్చిన అనుమతులు మీరి నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. NC22 లేటెస్ట్ షెడ్యూల్ కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రత్యేకమైన సెట్ వేశారు. ఆ సెట్ లో వైన్ షాప్ సెటప్ కూడా ఉంది.

samantha reaction about naga chaitanya

Advertisement

Samantha : అసలు ఏం జరిగిందంటే..

అందులో ఏం తప్పులేదు కానీ ఆ వైన్ షాప్ మెల్కోటే అనే గ్రామంలోని ప్రఖ్యాత దేవస్థానం పక్కన ఉండటమే అసలు విభాగానికి కారణమైంది. ఈ విషయం తెలిసి స్థానికులు ఏకంగా కర్రలతో వచ్చి నాగచైతన్య సినిమా యూనిట్ పై దాడికి ప్రయత్నించారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై స్పందించిన నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఆ ఘటనతో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే చైతు సినిమా ఆగిపోయిన విషయాన్ని తెలుసుకున్న సమంత.. తన సన్నిహితులతో అయ్యో పాపం అని బాధపడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా ప్రొఫెషనల్ గా మాత్రం నాగ చైతన్య చాలా మంచివాడు అని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన సినిమా మళ్లీ త్వరగా మొదలవ్వాలని కోరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి