Samantha : నాగ చైతన్య కి షాకింగ్ న్యూస్ : సమంత మళ్ళీ పెళ్లి ?

Authored By aruna | The Telugu News | Published on: July 9, 2023, 9:00 pm

Samantha  : టాలీవుడ్ బ్యూటీ సమంత ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంతో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం నాగచైతన్య, సమంతల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

మనకు తెలిసిందే సమంత గతేడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దాని నుంచి కోలుకున్నాక తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయింది. మళ్లీ ఏమైందో తెలియదు గానీ మళ్లి సమంత సినిమాలకు దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల కు దూరమైన సమంత మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి ఇంకా కోలుకోలేదని, దీని కారణంగా ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకు గురికావాల్సి వస్తుందట. దీంతో తనను అర్థం చేసుకున్న భాగస్వామి ఉంటే తన లైఫ్

Samantha ready to second marriage

Samantha ready to second marriage

సాఫీగా సాగుతుందని కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సమంత రెండో పెళ్ళికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. సమంత కూడా మంచి భర్త దొరికితే పర్సనల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చూస్తుందట. ప్రస్తుతం సమంత అటువైపు గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. అందుకే సమంత కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు సమంత శాశ్వతంగా సినిమాలకు దూరం అవుతుందని అంటున్నారు. ఇక సమంత ఇండస్ట్రీ తో అస్సలు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుందట.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp