
Samantha : ఎట్టకేలకి తన తప్పుని ఒప్పుకున్న సమంత.. పొరపాటు అయిందని కామెంట్..!
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత మయోసైటిస్ వలన ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి సినిమాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే సమంత క్రేజ్ తగ్గిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదనేది అక్షర సత్యం. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్రల్ ఇస్తోంది. ”హనీ, బన్నీ” అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుంది.
ఇక అల్లు అర్జున్, అట్లీ మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కూడా హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కాని ఈ ప్రాజెక్ట్ సమంత చేతి నుండి జారిపోయినట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే సమంత కొంత కాలంగా టే కొంత కాలంగా ఆరోగ్యంపై పాడ్ కాస్ట్ చేస్తోంది. ఆల్కేష్ సహోత్రితో కలిసి టేక్ 20 అనే పేరుతో పాడ్ కాస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ఆరోగ్యానికి సంబందించిన టిప్స్ ని ఫ్యాన్స్ తో సమంత పంచుకుంది. ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని పాడ్ కాస్ట్ ద్వారా సమంత ప్రమోట్ చేస్తోంది. అయితే ఓ నెటిజన్ సమంత చెబుతున్న ఆరోగ్యకరమైన టిప్స్ పై కామెంట్ చేశాడు.
Samantha : ఎట్టకేలకి తన తప్పుని ఒప్పుకున్న సమంత.. పొరపాటు అయిందని కామెంట్..!
ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉన్నాయి. గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు కదా దానికి ఏం సమాధానం చెబుతారని అడిగాడు. సమంత ఆ కామెంట్ పై రియాక్ట్ అయ్యింది. గతంలో నేను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే. అయితే అవి పూర్తిగా తెలియక చేసినవి మాత్రమే అని సమంత చెప్పుకొచ్చింది. వాటి గురించి తెలిసాక పూర్తిగా ఆపేశాను. ఇప్పుడు నేను ఏవైతే పాటిస్తున్నానో వాటి గురించే చెబుతున్నాను అని పేర్కొంది. మొత్తానికి సమంత తన తప్పుని తెలసుకొని రియలైజ్ అయినట్టు అర్ధమవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రజలలో కూడా హెల్త్ పై ఎక్కువ ఫోకస్ పెరిగింది. దానిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం, హెల్త్ టిప్స్ ఫాలో కావడం చేస్తున్నారు. అందుకే సమంత కూడా వాటిపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.