
Samantha : గ్లోబల్ స్టార్ అయితే ఏంటి.. సమంత ఇలా ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదుగా..?
Samantha : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాను బుచ్చి బాబు చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. రంగస్థలం సినిమాతో సుకుమార్, రామ్ చరణ్ కాంబో సూపర్ హిట్ అందుకోగా పుష్ప 1, 2 సినిమాలతో సుకుమార్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఐతే పుష్ప తర్వాత సుకుమార్ సినిమా అంటే నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉంటాయి. ఐతే ఈసారి చరణ్ కోసం మరో అద్భుతమైన కథతో రాబోతున్నారని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ కోసం గ్లోబల్ ఆడియన్స్ రీచ్ అయ్యేలా సుక్కు కథ సిద్ధం చేశాడట. ఐతే పుష్ప 2 పనుల్లో మొన్నటిదాకా బిజీగా ఉన్న సుకుమార్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలు పెడతారని తెల్సుతుంది.
Samantha : గ్లోబల్ స్టార్ అయితే ఏంటి.. సమంత ఇలా ట్విస్ట్ ఇస్తుందని ఊహించలేదుగా..?
ఆర్సీ 17వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న డిస్కషన్ నడుస్తుంది. చరణ్ సినిమాలో కూడా పుష్ప హీరోయిన్ రష్మికని తీసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. ఐతే రష్మిక ఆల్రెడీ కమిటైన సినిమాలు చాలా ఉండటం వల్ల ఛాన్స్ వదులుకోక తప్పట్లేదని తెలుస్తుంది. మరోపక్క రంగస్థలం హీరోయిన్ సమంతని కూడా సుకుమార్ టచ్ లోకి తీసుకున్నాడట.
ఐతే సమంత మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాల్లో చేసే ఇంట్రెస్ట్ లేదన్నట్టు చెబుతుందట. గ్లోబల్ స్టార్ సినిమా ఛాన్స్ వచ్చినా కూడా ఆమె కాదన్నదని ఎలుస్తుంది. ఐతే సమంత అంత ఈజీగా ఒప్పుకునేలా లేదని లైట్ తీసుకున్నారట మేకర్స్. ఆర్సీ 16 సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బుచ్చి బాబు సినిమా పూర్తి కాగానే రాం చహ్రణ్ వెంటనే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. Samantha, Ram Charan, Sukumar, Rashmika Mandanna, RC17, Pushpa 2, Tollywood
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.