Categories: andhra pradeshNews

Janasena : జ‌గ‌న్ కు షాక్‌.. జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే..!

Janasena  : జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వచ్చిన దొరబాబు, జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన జనసేనలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జనసేనాని కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లోనే ఆయన అధికారికంగా జనసేనలో చేరనున్నారు…

Janasena : జ‌గ‌న్ కు షాక్‌.. జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే..!

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దొరబాబు, ఇటీవల జరిగిన ఎన్నికల ముందు వైసీపీ అధిష్ఠానం తనను పక్కనపెట్టిన తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, వైసీపీ అధినేత జగన్ ఈ నియోజకవర్గాన్ని వంగా గీతకు కేటాయించారు.

చివరికి గీత ఓడిపోగా, పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ పరిణామాలతో దొరబాబు వైసీపీపై అసంతృప్తితో రాజీనామా చేశారు. వైసీపీని వీడిన తర్వాత దొరబాబు భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏమిటన్న దానిపై విశ్లేషణలు జరిగాయి. కొందరు ఆయన టీడీపీలో చేరతారని భావించగా, మరికొందరు జనసేన వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే టీడీపీలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించినప్పటికీ పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో చివరికి దొరబాబు జనసేననే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Recent Posts

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

20 minutes ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

15 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

16 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

16 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

18 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

19 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

20 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

21 hours ago