Samantha : నాగ చైతన్యకు విడాకులు ఇవ్వమన్నాడు.. చెప్పినట్టుగానే చేసిన సమంత
Samantha: అందాల ముద్దుగుమ్మ సమంతకు సంబంధించి నిత్యం ఏదో ఒక విషయం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది.ఆమె సినిమాలు, టూర్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు ఇలా ఒకటేంటి ఆమె ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చైతూ నుండి విడిపోయినప్పటి నుండి సమంత హాట్ టాపిక్‌గా మారుతుంది. నాలుగేళ్లు స్టార్ సెలబ్రిటీ కపుల్‌గా వెలుగొందిందీ జంట. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ జంటను చూసి ఎవరికి కన్ను కుట్టిందో ఏమో కానీ అర్ధాంతరంగా విడాకుల న్యూస్ అభిమానుల చెవిలో వేసి ఆందోళన కలిగించారు.వీరు కలిస్తే బాగుండని చాలా మంది అనుకుంటున్నప్పటికీ అది జరగడం అసాధ్యం అని మరి కొందరు అంటున్నారు.
సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిన విషయమే. గత కొద్ది రోజులుగా సామ్ తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేస్తూ వస్తోంది. మోటివేషనల్ కోట్స్ మాత్రమే కాకుండా.. తన లేటేస్ట్ ఫోటోస్.. టూర్ వీడియోస్.. ఇలా ప్రతి విషయాన్ని నెట్టింట్లో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. సామ్ ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ బాలీవుడ్ సినిమా కోసం పూర్తిగా తన ఫిట్‍నెస్ పై దృష్టి పెట్టిందని సమాచారం.

samantha replied a fan about divorce with naga chaitanya
Samantha : జోక్ నిజం అయింది…
అయితే సమంతకు సంబంధించి పాత విషయాలు కూడా ఇటీవల తెగ ట్రెండ్ అవుతున్నాయి. 2020లో సమంత ఓ గ్లామరస్ ఫోటో షేర్ చేయడంతో పాటు… ఫీలింగ్ గుడ్ అంటూ సదరు ఫోటోపై కామెంట్ పెట్టారు. ఆ ఫోటో క్రింద ఓ అభిమాని… నాగ చైతన్య కు విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో సమంత.. అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి సమంత రిప్లై ఇవ్వడం జరిగింది. అది చాలా కష్టం, నువ్వు నాగ చైతన్యను అడుగు.. అంటూ కూల్ గా సమాధానం చెప్పింది. 2020 నవంబర్ లో ఈ సంఘటన చోటు చేసుకోగా సరిగ్గా ఏడాది తర్వాత 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. ఇది ప్రతి ఒక్కరికి షాకింగ్‌గా మారింది. త్వరలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోనున్నాడనే ఒక టాక్ నడుస్తుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.