Samantha : సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అనే ప్రశ్నకు ఆమె స్నేహితురాలి ఇంట్రెస్టింగ్‌ సమాధానం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అనే ప్రశ్నకు ఆమె స్నేహితురాలి ఇంట్రెస్టింగ్‌ సమాధానం

 Authored By himanshi | The Telugu News | Updated on :9 March 2022,12:00 pm

Samantha : టాలీవుడ్ స్టార్స్‌ సమంతSamantha , నాగచైతన్య మ్యారేజ్‌ బ్రేకప్ తర్వాత కూడా బిజీ అయ్యారు. ఈ సమయంలో వారిద్దరూ మరో పెళ్లి చేసుకుంటారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇద్దరూ కూడా సినిమాలు మరియు వెబ్ సిరీస్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ వచ్చేసింది. కుటుంబ సభ్యులు మాత్రం వారి పెళ్లి విషయం లో ఆసక్తి గా ఉన్నారని చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సమంతకు వివాహం చేసే విషయమై కుటుంబ సభ్యుల్లో చర్చ జరుగుతోందని పుకార్లు తమిళ మీడియాలో వస్తున్నాయి.

ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్నాళ్ల తర్వాత అయినా రెండవ పెళ్లి చేసుకునేందుకు గాను ఇప్పటికే కుటుంబ సభ్యులకి సమంత ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆమెకు అత్యంత సన్నిహితురాలైన ఒక స్నేహితురాలిని అని అడగగా సమంత ప్రస్తుతానికి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఆమె కొత్త జీవితాన్ని అనుభవించేందుకు సమయం కావాలంటోంది. ప్రస్తుతానికి ఒంటరి జీవితాన్ని గడుపుతూ కొత్త ప్రపంచాన్ని చూస్తా అంటోంది. ఇప్పటి తన అయితే పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్ లో తన మనసుకు నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

Samantha second marriage news

Samantha second marriage news

పెళ్లి విషయంలో ప్రస్తుతానికి మాత్రం ఆలోచించడం లేదని పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెడుతుందట. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఆమె పెళ్లి విషయాన్ని మీడియాలో ప్రచారం చేసి ఆమె కెరీర్ ని ఇబ్బంది పెట్టేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న సమంత అప్పుడే రెండో పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తుంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మీడియాలో సమంత పెళ్లి గురించి అనవసర ప్రచారం జరుగుతోందని, తమిళ్ మీడియా ఎక్కువగా ఈ విషయాన్ని ఫోకస్ చేస్తుందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది