Home » Entertainment » Samantha Sensational Comments
Entertainment

Samantha : స‌మంత నోటి నుండి విడాకుల విష‌యాలు రాబ‌ట్ట‌బోతున్నాడా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 10, 2022, 11:00 am
Advertisement

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యం ముద్దుగుమ్మ సొంతం.ఇటీవ‌ల స‌మంత రేంజ్ మాములుగా లేదు. రీసెంట్‌గా సమంత రోల్స్ రాయిస్ లో రాణిలా దిగింది. క్వీన్ ఎలిజబెత్ ని తలపించింది. అలా కాస్ట్ లీ కార్ నుంచి స్టైలిష్ గా దిగిన సామ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫోటోగ్రాఫర్ల ముందు ఫోజులిచ్చింది. తన కళ్లకు బ్లాక్ కలర్ గాగుల్స్ ధరించి రెబల్ క్వీన్ నే తలపించింది. ప్రస్తుతం సమంత ముంబై చుట్టూనే తిరుగుతోంది.

Advertisement

అక్కడి పరిశ్రమపై కన్నేసింది. జెట్ స్పీడ్ తో తాను వెళ్లే మార్గంలోనే బిగ్ కెరీర్ ఆశిస్తోంది. బాలీవుడ్‌ బడా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా చేస్తోన్న కార్యక్రమమే ‘కాఫీ విత్‌ కరణ్‌’. ఇప్పటి వరకు అత్యధికంగా బాలీవుడ్‌ హీరోహీరోయిన్లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు నుండి బాహుబలి టీం తప్ప మరెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే తాజాగా సమంత దీనికి సంబంధించిన షూట్‌లో పాల్గొందని బాలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఆరు సీజన్లు కాగా, ఏడో సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

samantha sensational comments

Advertisement

Samantha : స‌మంత సంచ‌ల‌న కామెంట్స్  చేయ‌బోతుందా..!

కాగా, ఈ కార్యక్రమం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు గతంలో కరణ్‌ వెల్లడించారు. అయితే క‌ర‌ణ్ షోలో పాల్గొన్న స‌మంత త‌న విడాకుల విష‌యంపై నోరు విప్పింద‌నే టాక్ ఒక‌టి న‌డుస్తుంది. ఈ షోలో చాలా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే స‌మంత విడాకుల విష‌యం గురించి చ‌ర్చ న‌డించింద‌ని టాక్. ఇటు సమంత సైతం బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి కాగా, యశోద, ఖుషిలో చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి