Home » Entertainment » Samantha Shaakuntalam Movie Public Talk
Entertainment

Samantha : సమంతా ఆ ఒక్క తప్పూ చెయ్యకుండా ఉండి ఉంటే .. శాకుంతలం హిట్ అయ్యి ఉండేది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 16, 2023, 12:36 pm
Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత తాజాగా ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేదేమో అనిపిస్తుంది. శకుంతల, దుష్యంతుల పాత్రలకు సరైన ఆర్టిస్టులను తీసుకోకపోవడం వలన ఆ పాత్రలు హిట్ కాలేదని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదని అభిప్రాయాలు ఉన్నాయి. అసలు చరిత్ర ప్రకారం చూసుకుంటే శకుంతల దుష్యంతుడు కలుసుకునే సమయానికి వారి వయసు 16, 21 ఏళ్లు మాత్రమే. దుష్యంతుడిగా చేసిన మలయాళ నటుడు దేవ్ మోహన్ కాస్త పరవాలేదు అనిపిస్తుంది కానీ 35 ఏళ్ల వయసున్న సమంత శకుంతల పాత్రకు సెట్ కాలేదని అనిపిస్తుంది.

Advertisement

Samantha Shaakuntalam Movie Public Talk

చిన్న వయసు ఉండి చూడటానికి అందంగా, అమాయకంగా కనిపించే హీరోయిన్ ని శకుంతల పాత్రకు తీసుకోవాల్సింది అని జనాలు అంటున్నారు. ఇక సమంతను ఫ్యామిలీ మెన్ 2, పుష్ప ఐటమ్ సాంగ్ లో చూసి శకుంతలగా చూడలేకపోయారు. నటనపరంగా సమంత బెస్ట్ అయినా ఈ వయసులో ఆమెకు శకుంతల పాత్ర సూట్ కాలేదు. అయితే ఈ పాత్రకు శ్రీ లీల లాంటి యంగ్ హీరోయిన్ అయి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దుష్యంతుడి పాత్ర చేసిన దేవ్ మోహన్ కొత్తవాడు కావడంతో మనవాళ్లు ఆ పాత్రకు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు.

Advertisement

చక్రవర్తి పాత్ర కాబట్టి మాస్ ఇమేజ్ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా ఆ పాత్ర చేయాల్సింది. అప్పుడు ఆ పాత్ర బాగా హిట్ అయ్యేది. రెండు ప్రధాన పాత్రలకు సరైన ఆర్టిస్టులు తీసుకోకపోవడం వలన శకుంతల సినిమా జనాలకు సరిగా కనెక్ట్ కాలేదని స్పష్టమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14 న విడుదలైన శకుంతలం సినిమా కొందరిని ఆకట్టుకున్నా మరి కొంతమందిని ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి