Home » Exclusive » Viral News Of Food Delivery Boy And His Wife
Exclusive

Viral News : ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు తన భార్య ని కూడా తీసుకు వెళ్తాడు.. కారణం తెలిస్తే షాక్ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 16, 2023, 1:00 pm
Advertisement

Viral News : ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు తన భార్యను కూడా వెంటపెట్టుకొని తీసుకెళ్తున్నాడు. దీనికి కారణం ఏంటో తెలిస్తే చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. అంతేకాదు కొంచెం బాధగా కూడా ఉంది. గుజరాత్ కి చెందిన కేతన్ రజ్వీర్ ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఫుడ్ డెలివరీ అందించే ప్రతి చోటికి తన భార్యను కూడా తీసుకెళ్తుంటాడు. అయితే దీనికి కారణం అతని భార్య సోనాల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారట.

Advertisement

Viral News of food delivery boy and his wife

భార్య ఒంటరిగా ఇంట్లో ఉండడం వలన ప్రతికూల ఆలోచనలు వచ్చి ఆమె ఇబ్బంది పడుతుదని ఆమెను తన వెంట తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం సోనాల్ క్యాన్సర్ నాలుగో స్టేజిలో ఉంది. ఇప్పటివరకు ఆమెకు క్యాన్సర్ కీమోతెరపి చికిత్స ఎనిమిది సార్లు చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్న కేతన్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, బాధపడకుండా తన భార్యను ఇంట్లో ఉంచకుండా తనతో పాటు తీసుకెళ్తున్నారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. వీళ్ళని చూసినవాళ్లంతా అడిగినప్పుడు అతను తన భార్య పరిస్థితి, సమస్యను చెబుతున్నాడట.

Advertisement

కేతన్ కు తన భార్యపై ఉన్న ప్రేమను చూసి కంటతడి పెట్టుకోకుండా ఉండలేరు. కేతన్ సోనాల్ 2007లో వివాహం చేసుకున్నారు. 8 నెలల క్రితం సోనాల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఆమెకు విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా క్యాన్సర్ వచ్చిందని నిర్ధారించారు. అప్పటినుంచి ఆమె చికిత్స తీసుకుంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండడం వలన ప్రతికూల ఆలోచనలతో ఆమె ఇంకా ఇబ్బంది పడుతుందని కేతన్ ప్రతిరోజు ఆమెను ఫుడ్ డెలివరీకి వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్తున్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి