Samantha : సమంత శాకుంతలం.. అదిరిపోయే లుక్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత శాకుంతలం.. అదిరిపోయే లుక్!

Samantha : గుణ శేఖర్ ప్రస్తుతం మరో అద్భుతాన్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అసలే గుణ శేఖర్ ఫాం కోల్పోయి ఉన్నాడు. సరైన కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. చివరగా వచ్చిన రుద్రమదేవీ కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత గుణ శేఖర్ మెగా ఫోన్ పట్టుకోబోతోన్నాడు. మైథలాజికల్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు గుణ శేఖర్ భారీ ప్లాన్ వేశాడు. శకుంతల దుష్యంతుల ప్రేమ కావ్యాన్ని తెరపై […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :15 March 2021,10:50 am

Samantha : గుణ శేఖర్ ప్రస్తుతం మరో అద్భుతాన్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అసలే గుణ శేఖర్ ఫాం కోల్పోయి ఉన్నాడు. సరైన కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. చివరగా వచ్చిన రుద్రమదేవీ కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత గుణ శేఖర్ మెగా ఫోన్ పట్టుకోబోతోన్నాడు. మైథలాజికల్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు గుణ శేఖర్ భారీ ప్లాన్ వేశాడు. శకుంతల దుష్యంతుల ప్రేమ కావ్యాన్ని తెరపై ఆవిష్కరించబోతోన్నాడు.

శకుంతలగా సమంత నటిస్తోంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ వదిలిన చిన్న వీడియో అందరినీ ఆకట్టుకుంది. దానికి మణిశర్మ కొట్టిన నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సమంత పక్కన దుశ్యంతుడిగా మళయాలి నటుడిని తీసుకొచ్చారు. దేవ్ మోహన్ అనే నటుడు దుశ్యంతుడిగా నటించబోతోన్నట్టు ప్రకటించేశారు. అయితే ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక నేడు లాంఛనంగా ఈ మూవీని ప్రారంభించనున్నారు.

Samantha Shaakuntalam Movie Shooting Opening

Samantha Shaakuntalam Movie Shooting Opening

Samantha : సమంత శాకుంతలం.. అదిరిపోయే లుక్!

ఈ మేరకు ప్రారంభోత్సవ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ వేడుకలో సమంత సంప్రదాయ వస్త్రాదారణలో కనిపించింది. ఈలుక్కులో సమంత అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంది. ఇక నాటి కాలపు దేవ లోకాన్ని మరోసారి రీ క్రియేట్ చేసేందుకు గుణ శేఖర్ సెట్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ మూవీతో సమంత తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చే చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీకి సంబంధించిన వివరాలు మరికాసేపట్లో బయటకు రానున్నాయి.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది