Home » Entertainment » Samantha Shed Tears After Touching Naga Chaitanya
Entertainment

Samantha : నాగ చైతన్యని తలుచుకుని కన్నీరు పెట్టుకున్న సమంత.. వీడియో

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 21, 2023 1:24 pm
Advertisement

Samantha : హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు మహేష్, ఎన్టీఆర్, బన్నీ, పవన్ కళ్యాణ్ ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోలతో నటించి 2017లో నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్నా ఐదు సంవత్సరాలకి 2021వ సంవత్సరంలో విడాకులు ఇవ్వడం జరిగింది.

Advertisement

పెళ్లి చేసుకున్నా తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయగా విడాకులు తీసుకున్నాక అందాల డోస్ పెంచుతూ అనేక పాత్రలు చేయడం జరిగింది. చైతుతో విడిపోయాక సమంత కెరియర్ డేంజర్ జోన్ లో పడుతుందని భావించిన గాని ఊహించని రీతిలో… అవకాశాలు రావడం జరిగింది. “పుష్ప”లో ఐటెం సాంగ్ లో సమంత వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అనంతరం గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధికి సమంత గురి కావడం తెలిసిందే.

Samantha shed tears after touching Naga Chaitanya

Advertisement

ఈ క్రమంలో “యశోద” సినిమా చేయటం జరిగింది. అనారోగ్యం కారణంగా “యశోద” ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా సమంత పెద్దగా పాల్గొనలేదు. కానీ యాంకర్ సుమకి “యశోద”కి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తన గతాన్ని తలుచుకొని ముఖ్యంగా నాగచైతన్యతో రిలేషన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఇంటర్వ్యూ ఇచ్చిన టైం కంటే.. రెండు నెలల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోకీ భారీ ఎత్తున రెస్పాన్స్ రావడం విశేషం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి