Samantha : ఏమైంది సమంత నీకు… ఎందుకు ఇంతలా అందాలన్నీ ఆరబోస్తున్నావ్..!
ప్రధానాంశాలు:
Samantha : ఏమైంది సమంత నీకు... ఎందుకు ఇంతలా అందాలన్నీ ఆరబోస్తున్నావ్..!
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఎంతో ప్రేమించి అక్కనేని మూడో తరం వారసుడు నాగ చైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నాళ్లకే అతని నుండి విడిపోయింది. ఆ తర్వాత మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంది. మయోసైటిస్ వ్యాధి వలన కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా సమంత కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి మత్తెక్కిస్తుంది. ఎద అందాలని ఎరగా చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. నాగ చైతన్య నుండి విడిపోయాక సమంతపై ఎన్ని విమర్శలు వచ్చిన కూడా ఆమె మాత్రం సోషల్ మీడియాలో పిచ్చెక్కించేలా ఫొటో షూట్స్ చేస్తుంది.
సమంత లేటెస్ట్ పిక్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఏ మాయ చేసావే’ సినిమాతో ఆరంగేట్రం చేసి, తన ప్రతిభతో ఒక్కో సినిమాలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగిన సమంత ‘ఫామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ అందుకుంది.’పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ ఐటమ్ సాంగ్, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర సమంత రేంజ్‌ని పీక్స్‌కి వెళ్లేలా చేశాయి. అయితే ఇవే సమంత విడాకులకి కూడా ఓ కారణం అంటూ ప్రచారం జరుగుతుంది. కాని ఒకవైపు విడాకులు, మరోవైపు మయోసైటిస్ వ్యాధి వచ్చిన కూడా సమంత మాత్రం ఇంత ధైర్యంగా ఉండడం గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే సమంత మయోసిటిస్ వ్యాధి గురించి ఓ సీక్రెట్ రివీల్ చేసింది.తాను ప్రతి రోజు 10 రకాల పనులు చేస్తానని.. అలాగే కేవలం ఐదు గంటలే నిద్రపోతానని చెప్పుకొచ్చింది. తాను టాప్ పొజీషన్‌లో ఉన్నప్పటికీ దానిని ఎంజాయ్ చేయలేకపోతున్నట్టు పేర్కొంది. కెరీర్‌లో తను చాలా సార్లు బాధపడినట్టు పేర్కొంది. యశోద సినిమా సమయంలో అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో తనపై అనేక రూమర్స్ వచ్చాయని, అందుకే తనకు మయెసైటిస్ అనే వ్యాధి గురించి రివీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.