Home » Entertainment » Samantha Tweet On Nagarjun Anr Lives On Special Video
Entertainment

Samantha : నాగార్జునను అవమానించిన సమంత.. అక్కినేని అభిమానుల దెబ్బకు దిగొచ్చింది!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 21, 2021, 6:30 pm
Advertisement

Samantha : ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉంటోంది. అక్కినేని ఫ్యామిలీ పర్సనల్ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం, ముదిరి పాకాన పడుతోంది. లెక్కలేనన్ని వార్తలు, రూమర్లు వారిని చుట్టుముడుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా నోరు విప్పడం లేదు. సమంత, చైతన్య కానీ వాటిపై స్పందించడం లేదు. ఖండించడం లేదు. అయితే తాజాగా సమంత వేసిన ఓ ట్వీట్ అక్కినేని అభిమానులను హర్ట్ చేసింది.

Advertisement

Samantha Tweet on Nagarjun ANR Lives On Special Video

మామూలుగా అయితే నాగార్జునను సమంత ఎప్పుడూ కూడా మామా అని ప్రేమగా సంబోధిస్తుంటుంది. నాగ్ మామా అని పిలుస్తుంటుంది. కానీ మొదటిసారిగా అలాంటివేమీ లేకుండా.. ఎవరో తన ఫ్రెండ్, తన సహచర నటుడు అయినట్టుగా సాధారణ మనిషిలా ట్రీట్ చేసింది.

Advertisement

Samantha Tweet on Nagarjun ANR Lives On Special Video

ట్వీట్ వేసింది. ఇక ఏఎన్నార్ జయంతి సందర్భంగా నాగార్జున ఓ వీడియో రిలీజ్ చేస్తూ ట్వీట్ వేశాడు. అందులో ఏఎన్నార్ గురించిచెబుతూ.. బంగార్రాజు సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు నాగ్.

Advertisement

Samantha : మామా అంటూ సంబోధించిన సమంత..

 

Samantha Tweet on Nagarjun ANR Lives On Special Video

ఆ ట్వీట్ మీద సమంత స్పందించింది.. అద్భుతంగా ఉంది నాగార్జున అంటూ నాగ్ ట్వీటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేసింది. కేవలం నాగార్జునే ట్విట్టర్ హ్యాండిల్‌ను మాత్రమే పెట్టింది. సర్ గానీ, మామా అని గానీ, గారు అని గానీ పెట్టలేదు. దీంతో అక్కినేని అభిమానులు సమంత మీద విరుచుకపడ్డారు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని మళ్లీ ట్వీట్‌ను డిలీట్ చేసింది..కొత్తగా నాగార్జున మామా అని ట్వీట్ పెట్టింది. దీంతో అభిమానులు శాంతించారు. అలా నాగార్జున మామా అనడంతో చై సామ్ విడాకులకు కూడా ముగింపు పడ్డట్టు అయింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి