samantha emotional post in social media
Samantha సమంత సినీ ఇండస్ట్రీలో ఒక లేడీ లెజెండ్. తన కెరీర్‌లో ఎన్ని గడ్డుపరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇస్తుంటుంది. జీవితం అనేది మళ్లీ రాదని, ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలని తన మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తుంది. అయితే, సామ్ చెప్పే వాటిని కొందరు అపార్థం చేసుకోవడమే కాకుండా ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. జీవితంలో మనకు నచ్చిన దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇతరుల కోసం మన జీవితాన్ని పణంగా పెట్టకూడదనేది సామ్ ఫిలాసఫీగా చెప్పవచ్చు.
samantha viral pic
సమంత తన కెరీర్ లో ఎన్ని జయాపజయాలను చూసింది. అంతకుమించి ఒక లేడీగా జీవితాన్ని చదివింది. కెరీర్ మంచి రైజింగ్ టైంలో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. తర్వాత నాలుగేళ్ల హ్యాపీగా సాగిన వీరి కాపురంలో ఏవో గొడవలు. బాహ్య ప్రపంచానికి అస్సలు తెలీదు. సడెన్ ఒక రోజు తన మనస్సులోని మాటలను ఎలాంటి చడిచప్పుడు లేకుండా ఒక్క పోస్టు రూపంలో అందరికీ చెప్పేసింది. ఆ తర్వాత సోషల్ మీడియా, ప్రసార మాద్యమాల్లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు అనుకున్న టైం రానే వచ్చింది. అందరికీ సున్నితంగానే చెప్పేసింది మేము విడిపోతున్నాం.. తన తప్పు ఏమీ లేదని, నన్ను అందరూ ఆడిపోసుకోవడం మానేయాలని సూటిగా బదులిచ్చింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లి సైలెంట్‌గానే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై ఫైట్ చేసి గెలిచింది కూడా..
samantha viral pic
అయితే, తాజాగా సామ్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక పోస్టు చేసింది. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో ప్రేమకు సంబంధించి మీలో ఒక స్వరం వినిపించినట్టయితే దానిని మీరు చిత్రీకరించలేరు.. అన్నివిధాలుగా పెయింట్ చేసి చూడండి.. అయినప్పటికీ ఆ స్వరం నిశ్శబ్దంగానే ఉంటుందని రాసుకొచ్చింది సామ్.. కొందరికీ ఇందులో మీనింగ్ అర్థంకాకపోవచ్చు. ప్రేమ అనేది బయటకు కనిపించదు.. ఎప్పటికీ సైలెంట్‌గానే ఉంటుందని పేర్కొంది. కొవిడ్- 19 బారిన పడిన ప్రజలకు నివాళులర్పిస్తూ @manohar_chiluveru రూపొందించిన ఆర్ట్ ప్రాజెక్ట్ హోప్ కోస్మోస్‌తో సామ్ భాగమైంది. వాల్‌పై కలర్ ఫుల్ పెయింట్ వేసి.. ప్రజలను నయం చేయడానికి మరియు ఒకచోట చేర్చడానికి ,ఆశను ప్రోత్సహించడానికి కళను ఒక మాధ్యమంగా ఉపయోగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.