
Samantha yoga asanas pics viral
Samantha : టాలీవుడ్ లో ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ సమంత అక్కినేని. సినిమాల కోసమే ఫిట్ గా ఉండాలని సమంత ఎప్పుడు అనుకోలేదు. రొటీన్ లైఫ్ లో ఫిట్‌నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది. ప్రతీ రోజూ సమంత జిం లో కసతరత్తులు చేయాల్సిందే. సమంతని చూస్తే ఎవరైనా 100 కేజీల బరువు ఎత్తగలదని అనుకుంటారా.. కాని ఇది నిజం. సమంత అవలీలగా 100 కేజీల బరువును ఎత్తగలదు. ఈ విషయాన్ని ఒక సందర్భంలో టాలీవుడ్ స్టాల్ హీరో రానా దగ్గుబాటి స్వయంగా చెప్పాడు. ఎప్పుడు ఏదో ఒక వ్యాపకంతో బిజీగా ఉండే సమంత అప్పుడప్పుడు సందేశాలు కూడా ఇస్తుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా కొత్త రకమైన ఆసనం వేసి అభిమానులకి షాకిచ్చింది. ఇలాంటి ఆసనం వేయాలంటే ఎవరైనా అంత త్వరగా ధైర్యం చేయరు. కానీ ఇక్కడుంది సమంత. తను ఏదైనా
చేస్తుందనడానికి ఇదుగో ఈ ఆసనమే తాజాగా ఉదాహరణ. సమంత గాలిలో తాడుకు.. తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి.. తలకిందులుగా వేలాడుతున్న ఆసనం వేసి ఆశర్యపరచింది. ఇలా వేలాడుతు వేసిన ఆసనం పిక్‌ని అభిమానులకు షేర్ చేయడమే కాదు.. ‘లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేది’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక నెటిజన్స్ అయితే సమంతకి జాగ్రత్త్లు పాటించమని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి అక్కినేని కోడలా మజాకానా.. అనేలా తన టాలెంట్ చూపిస్తోంది.
Samantha yoga asanas pics viral
కాగా సమంత హిందీలో ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ పోషించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమిగ్ కి రెడీ కానుండగా తెలుగు వారైన రాజ్ నిడిమోరు, డికె దర్శకత్వం వహించారు. మనోజ్ వాజ్‌పాయ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతల సినిమా చేస్తోంది సమంత. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తునారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.