Samantha : ఆసనంతో చంపేస్తున్న సమంత..!

Authored By vamana sai | The Telugu News | Published on: April 15, 2021, 2:30 pm

Samantha : టాలీవుడ్ లో ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ సమంత అక్కినేని. సినిమాల కోసమే ఫిట్ గా ఉండాలని సమంత ఎప్పుడు అనుకోలేదు. రొటీన్ లైఫ్ లో ఫిట్‌నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది. ప్రతీ రోజూ సమంత జిం లో కసతరత్తులు చేయాల్సిందే. సమంతని చూస్తే ఎవరైనా 100 కేజీల బరువు ఎత్తగలదని అనుకుంటారా.. కాని ఇది నిజం. సమంత అవలీలగా 100 కేజీల బరువును ఎత్తగలదు. ఈ విషయాన్ని ఒక సందర్భంలో టాలీవుడ్ స్టాల్ హీరో రానా దగ్గుబాటి స్వయంగా చెప్పాడు. ఎప్పుడు ఏదో ఒక వ్యాపకంతో బిజీగా ఉండే సమంత అప్పుడప్పుడు సందేశాలు కూడా ఇస్తుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా కొత్త రకమైన ఆసనం వేసి అభిమానులకి షాకిచ్చింది. ఇలాంటి ఆసనం వేయాలంటే ఎవరైనా అంత త్వరగా ధైర్యం చేయరు. కానీ ఇక్కడుంది సమంత. తను ఏదైనా
చేస్తుందనడానికి ఇదుగో ఈ ఆసనమే తాజాగా ఉదాహరణ. సమంత గాలిలో తాడుకు.. తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి.. తలకిందులుగా వేలాడుతున్న ఆసనం వేసి ఆశర్యపరచింది. ఇలా వేలాడుతు వేసిన ఆసనం పిక్‌ని అభిమానులకు షేర్ చేయడమే కాదు.. ‘లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేది’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక నెటిజన్స్ అయితే సమంతకి జాగ్రత్త్లు పాటించమని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి అక్కినేని కోడలా మజాకానా.. అనేలా తన టాలెంట్ చూపిస్తోంది.

Samantha yoga asanas pics viral

Samantha yoga asanas pics viral

Samantha : సమంత ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2లో నెగిటివ్ రోల్ పోషించింది.

కాగా సమంత హిందీలో ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ పోషించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమిగ్ కి రెడీ కానుండగా తెలుగు వారైన రాజ్ నిడిమోరు, డికె దర్శకత్వం వహించారు. మనోజ్ వాజ్‌పాయ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతల సినిమా చేస్తోంది సమంత. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తునారు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp