samrat learns the truth about tulasi in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 12 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 735 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ కూడా తులసి ఇంటికి వస్తోందని.. తాను కూడా వినాయక పూజ కోసం తులసి ఆంటి ఇంటికి వెళ్తున్నానని లక్కీ.. లాస్య, నందుకు చెప్పి వెళ్లిపోతాడు. దీంతో లాస్యకు కోపం వస్తుంది. అసలు హనీ రావడం ఏంటి.. ఆ సామ్రాట్ ఎలా మళ్లీ ఏ మొహం పెట్టుకొని తులసి ఇంటికి వెళ్తున్నారు అని కోపం ప్రదర్శిస్తాడు నందు. ఆ తర్వాత మనం కూడా వెళ్దాం పదా అని లాస్య నందుతో అంటుంది. మరోవైపు తెల్లవారుతుంది. వినాయకుడి పండుగ కోసం తులసి తయారు అవుతూ ఉంటుంది. అందరూ లేచి రెడీ అవుతారు.
samrat learns the truth about tulasi in intinti gruhalakshmi
ఇంతలో లక్కీ వస్తాడు. వినాయకుడి పూజ కోసం అందరూ కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కారులో సామ్రాట్, హనీ, బాబాయిని తీసుకొచ్చి మీరు వెళ్లండి. నేను తర్వాత వస్తా అని చెబుతాడు. వాళ్లు వెళ్లిపోయాక కారు డోర్ వేసుకొని కారులోనే కూర్చొంటారు. ఇంతలో నందు, లాస్య కారు వచ్చి ఆగుతుంది. సామ్రాట్ కారును చూస్తారు. ఈయన కూడా అప్పుడే వచ్చేశాడా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సామ్రాట్ కారులో ఉన్న విషయాన్ని వాళ్లు చూడరు. దీంతో సామ్రాట్ గురించి అన్నీ మాట్లాడుకుంటారు. తెల్లవారకుండానే వచ్చి వాలాడు కదా. పైకి మాత్రం ఎలా ఉంటాడు.. తులసి అంటే పడనట్టు పెద్ద ఫోజు.. సామ్రాట్ గారు వస్తారా అని తులసి అడగగానే వయ్యారాలు పోతూ వచ్చాడు అని అంటుంది లాస్య.
నువ్వు వస్తే వచ్చావు కానీ… ఇంట్లో ఎవ్వరితో గొడవ పెట్టుకోకు అని చెబుతుంది లాస్య. దీంతో సరే అంటాడు నందు. గుడికి వెళ్లి దివ్య కోసం ప్రసాదం తీసుకొచ్చాను అని చెప్పి దివ్యకు ఇవ్వు.. అని చెబుతుంది. దీంతో ఎవ్వరూ ఇంకేం అడగరు అంటుంది లాస్య.
ఇంకో మాట గుర్తు పెట్టుకో.. లోపల ఎవ్వరు రెచ్చగొట్టినా కూల్ గా ఉండు. మాజీ భర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకుండా దాచావని, నువ్వే రిక్వెస్ట్ చేసిన నిజం పొరపాటున కూడా సామ్రాట్ గారికి తెలిసేలా చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు నందు, లాస్య.
అయితే.. కారులో ఉన్న సామ్రాట్.. ఇవన్నీ విని షాక్ అవుతాడు. అంటే నేనే తులసిని అపార్థం చేసుకున్నానా అని అనుకుంటాడు. సామ్రాట్ వచ్చిన విషయం తెలుసుకొని తులసి… సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఇంట్లోకి రావాలని కోరుతుంది. దీంతో పర్లేదు అంటాడు సామ్రాట్.
దయచేసి మీరు లోపలికి రండి అంటే వస్తాడు సామ్రాట్. నువ్వు కూడా మాతో పాటు వినాయకుడి పూజలో కూర్చోవాలి అని హనీ..సామ్రాట్ ను కోరుతుంది. దీంతో మా ఇంటి మీద పడి గొడవ చేసి.. మా మామ్ ను బ్లేమ్ చేసినందుకు ముందు మా మామ్ కు సారీ చెప్పి ఆ తర్వాత పూజలో కూర్చోవాలి అని అభి అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.