Home » Entertainment » Samyuktha Menon Un Happy With Bheemla Nayak
Entertainment

Samyuktha Menon : భీమ్లా నాయ‌క్ విష‌యంలో నిత్యా మీన‌న్‌తో పాటు సంయుక్త మీనన్ కూడా హ్యాపీగా లేదా.. !

Authored By
Sam C
The Telugu News | Updated on: March 2, 2022, 9:35 pm
Advertisement

Samyuktha Menon : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కించిన చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అటు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా భీమ్లా హవా కొనసాగుతోంది. అమెరికాలో తొలి వీకెండ్‌లోనే 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15కోట్లు) రాబట్టింది. మంగళవారం నాటికి ఈ మూవీ యూఎస్‌లో 2.23మిలియన్లకు(గ్రాస్) పైగా వసూలు చేయడం విశేషం. దీంతో పవన్ కెరీర్‌లోనే అమెరికాలో ‘భీమ్లా నాయక్’‌ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే సినిమా స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఇందులో న‌టించిన న‌టీమ‌ణులు సంతృప్తిగా లేర‌ని తెలుస్తుంది.

Advertisement

ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించిన నిత్యా మీన‌న్.. ఈ సినిమాలో తాను చేసిన ఓ సాంగ్ తొల‌గించ‌డంతో అసంతృప్తిగా ఉంద‌నే టాక్ వినిపించింది. ఇక రానా పక్కన నటించిన సంయుక్త మీనన్ మాత్రం భీమ్లా నాయక్ విషయంలో అసంతృప్తిగా ఉందంటూ కొన్ని రూమర్లు వచ్చాయి. సంయుక్త పాత్రను చాలా వరకు తగ్గించారని, సీన్లు అన్నీ కట్ చేసేశారంటూ సంయుక్త వాపోయిందట. చాలా సీన్లకు కత్తెర పడటంతో సంయుక్త తెగ బాధపడుతోందని వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌పై సంయుక్త మీనన్ స్పందించింది.అవును నేను భీమ్లా నాయక్ విషయంలో అసంతృప్తి చెందాను. కానీ అది ఎప్పుడు అంటే.. మళ్లీ రెండో సారి అభిమానులతో కలిసి సినిమా చూద్దామంటే టికెట్లు దొరకలేదు.

samyuktha menon un happy with bheemla nayak

Advertisement

Samyuktha Menon : సంయుక్త పంచ్ వేసిందిగా..

. అందుకే డిసప్పాయింట్ అయ్యాను అంటూ రూమర్లు ఫన్నీగా కొట్టి పారేసింది సంయుక్త మీనన్. ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవ్వడం హ్యాపీగా ఉందని, నా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నట్టుగా సంయుక్త ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే సంయుక్త పేరుతో ఫేక్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను రన్‌ చేస్తున్నారు కొంద‌రు ఫేక్ రాయుళ్లు. ఈ అకౌంట్‌కి ఏకంగా 70 వేలకిపైగా ఫాలోవర్లు దక్కడం గమనార్హం. దీంతో ఈ విషయాన్ని గమనించిన సంయుక్త తన అభిమానులను అలర్ట్‌ చేసింది. అది తన అకౌంట్‌ కాదని, ఒక అలర్ట్‌ మెసేజ్‌తో కూడిన ఫోటోను పోస్ట్‌ చేసింది సంయుక్త.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి