
Sangeetha sensational comments on her mother
Sangeetha : ఒకే ఒక్క ఛాన్స్… అంటూ ఖడ్గంలో సినిమాలో సంగీత చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుంటుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే పల్లెటూరి నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఒక్క చాన్స్ అంటూ పిలికే డైలాగ్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే సంగీత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఖడ్గం తర్వాత సంగీతకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా తరవాత శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లాం ఊరెళితే సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలయ్యతో విజయేంద్రవర్మ, రవితేజకు జోడీగా ఈ అబ్బాయి చాలా మంచోడు, శివపుత్రుడు సినిమాలతో పాపులారిటి తెచ్చుకుంది. ఇలా పలు సినిమాలు చేసిన సంగీత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఈ మధ్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. కాగా సంగీత సింగర్ క్రిష్ ను వివాహం చేసుకుంది. ఇక రీ ఎంట్రీ తర్వాత బుల్లితెరపై.. సినిమాల్లో సందడి చేస్తోంది. అయితే సంగీతకు తన తల్లి నుంచే తనకు వేధింపులు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. విషయం ఏంటంటే సంగీత తన తల్లి ఒకే ఇంటిలో ఉంటున్నారు. సంగీత తన భర్తతో పై ఫ్లాట్ లో ఉంటే.. ఆమె తల్లి తన పెద్ద కుమారుడితో కలిసి కింద అంతస్తులోలో ఉండేవారు. కాగా సంగీత తల్లి తనను సంగీత ఇల్లు కాళీ చేసి వెళ్లిపోవాలని వేధిస్తోందని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
Sangeetha sensational comments on her mother
దాంతో ఈ వార్త టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో అసలు ఏం జరిగిందో సంగీత ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తన తల్లి 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే తనను డబ్బులు సంపాదించే వస్తువుగా వాడుకుందని చెప్పింది. తన అన్న, తమ్ముడు మత్తుకు బానిసలు అయ్యారని ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదని చెప్పింది. కానీ తన తల్లి మాత్రం వాళ్లను వెనకేసుకు వస్తు తనను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి అంటే ఎలా ఉండకూడదో తన తల్లిని చూసి నేర్చుకున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తన పైనే కేసులు పెట్టి పరువు తీయాలని చూసింది అని చెప్పుకొచ్చింది. తను పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉండటం తన తల్లికి ఇష్టం లేదని ఆరోపించింది. తన కుటుంబంలో కలహాలు పెట్టేందుకు కూడా ప్రయత్నించిందంటూ సంచలన ఆరోపణలు చేసింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.