Sankranthi Movies : సంక్రాంతికి వస్తామంటూ రెండు మూడు నెలలుగా ఊదరగొడుతున్న సినిమాలు వాయిదా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి బాగానే ఉన్నా ఉత్తరాదిన థియేటర్లు ఆంక్షల్లోకి వెళ్లి పోయాయి.. 50 శాతం ఆక్యుపెన్సీ మరియు నైట్ కర్ఫ్యూ ఇంకా అనేక ఇబ్బందులు అక్కడ ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలు కనుక ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. రాధే శ్యామ్ నుండి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కాని ఖచ్చితంగా ఆ సినిమా కూడా వాయిదా తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఆ సినిమాలు వాయిదా పడటంతో చిన్నా చితక సినిమాలు చాలానే సంక్రాంతికి రాబోతున్నాయి. అందులో ప్రథానంగా అందరి దృష్టి సంక్రాంతికి రాబోతున్న బంగార్రాజుపై ఉంది. సంక్రాంతికి వచ్చే సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రభావం ఉండక పోవచ్చు. కాని ఆ తర్వాత ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని.. తద్వారా ఆ నెలల్లో వచ్చే సినిమాలకు గడ్డు పరిస్థితి తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పదుల్లో నమోదు అవుతున్న ఉత్తరాదిన ఆంక్షలు మొదలు అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అలా మారే అవకాశం ఉంది.. అంతకు మించి కూడా మారే అవకాశాలు లేక పోలేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఫిబ్రవరిలో సినిమా థియేటర్లు మూసి వేయడం లేదా 50 శాతం ఆక్యుపెన్సీ కి తగ్గించడం చేస్తారు. అదే కనుక చేస్తే ఆ నెలలో రావాలనుకున్న పెద్ద సినిమాల పరిస్థితి ఏంటో అంటూ మళ్లీ చర్చ మొదలు అయ్యింది. ఫిబ్రవరిలో చిన్నా చితకా పెద్ద సినిమాలు కలిపి చాలానే రాబోతున్నాయి. అందులో ప్రథానంగా చిరంజీవి నటించిన ఆచార్య మరియు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఇంకా రవితేజ నటించిన ఖిలాడి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి.
పెద్ద ఎత్తున ఫిబ్రవరి నెలలో సినిమాలు వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా ఒమిక్రాన్ వల్ల ఆ సినిమాల వాయిదా తప్పదేమో అన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని మేకర్స్ సినిమా విడుదల కు తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్ మొదలు పెట్టాలా వద్దా అన్నట్లుగా జుట్టు పీక్కుంటున్నారట. ఆచార్య మేకర్స్ కొత్త సంవత్సరం కానుకగా ఒక పాటను విడుదల చేయడం జరిగింది. ఇంకా ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టలేదు. ఏం జరుగుతుందో అంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.