Janhvi Kapoor : అమ్మాయిలకు అమ్మాయిలే కావాలట.. జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్
Janhvi Kapoor : స్వర్గీయ అతిలోక సుందరి శ్రీదేవీ ముద్దుల తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు.అందాల ఆరబోతలో పీహెచ్‌డీ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆమె స్టార్ కిడ్స్ చేసే స్నేహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌లు క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఇద్దరూ కలిసి చేసే అందాల విందు, కలిసి చేసే వర్కవుట్లు చూస్తే జనాలకు చెమటలు పట్టాల్సిందే. అలా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌లు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాను ఊపేస్తుంటారు.

Sara Alikhan And Janhvi Kapoor Latest Photoshoot
ఈ ఇద్దరూ కలిసి చేసే ఫోటో షూట్లు కూడా చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎక్కడికెళ్లినా ఈ ఇద్దరూ కలిసి ఉంటారు. ఇద్దరూ కలిసి పార్టీల్లో నానా హంగామా చేస్తుంటారు. అయితే తాజాగా జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌లు కలిసి ఓ ఫోటో షూట్ చేశారు. దానికి జాన్వీ కపూర్ పెట్టిన క్యాప్షన్ చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అమ్మాయిలకు అమ్మాయిలే కావాలంటూ పోస్ట్ చేసింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక మరో వైపు ఆ ఫోటో షూట్ గురించి సారా అలీ ఖాన్ కూడా కామెంట్ చేసింది.
Janhvi Kapoor సారా, జాన్వీల అందాల విందు

Sara Alikhan And Janhvi Kapoor Latest Photoshoot
నిజమైన యువరాణులు ఎప్పుడూ కూడా వారి కిరీటాలను ఒకరినొకరు పెట్టుకుంటారు. ఫ్రెండ్ షిప్, ఇన్‌స్పిరేషన్, మోటివేషన్, జిమ్ అన్నీ కూడా పెరుగుతూనే వచ్చాయి. ఎక్కడైనా సరే ప్రేమిస్తూనే ఉంటాం.. నవ్వుతు ఉంటాం. ఇంట్లో ఉన్నా కూడా దుమ్ములేపుతాం. షూటింగ్‌లో ఉన్నా రచ్చ చేస్తాం. ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా హల్చల్ చేస్తామని తమ ఫ్రెండ్ షిప్ గురించి సారా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఫోటో షూట్‌తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నారు.