Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో దమ్ముకొడుతున్న భామలు.. వీళ్లు మామూలోళ్లు కాదు
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో అన్ని రకాల సౌలభ్యాలుంటాయి. సౌకర్యాలుంటాయి. అయితే కొన్నింట్లో మాత్రం పరిమితంగానే ఉంటాయి. దమ్ముకొట్టడం అనేది బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో పర్మిషన్ ఉంటుంది. అలా స్మోకింగ్ జోన్ అంటూ సపరేట్‌గా ఉంటుంది. అయితే అక్కడ కూడా కెమెరాలుంటాయి. కొందరు కంటెస్టెంట్లు వాటిని పట్టించుకోకుండానే దమ్ముకొడుతుంటారు. వారి వారి అలవాట్లకు తగ్గట్టుగా ఉంటారు. అయితే ఇంత వరకు కూడా బిగ్ బాస్ ఇంట్లో దమ్ముకొట్టిన లేడీ కంటెస్టెంట్లు మాత్రం రాలేదు.
ఓరి నాయనో దమ్ముకొడుతున్న భామలు.. Bigg Boss 5 Telugu
కానీ ఈ ఐదో సీజన్‌లో మాత్రం లేడీ కంటెస్టెంట్లు మహా ముదరుగా ఉన్నారు. ఒకరిని మించి మరొకరు అనేట్టుగా ఉన్నారు. పచ్చి బూతుల పిల్ల సరయు అయితే చెప్పనక్కర్లేదు. ఆమె వేషదారణ, మాట తీరు అన్నీ కూడా వింతగానే ఉంటాయి. నోట్లోంచి మింగుడు అనే పదం తప్పా ఇంకేది రానట్టుగా ఉంటుంది. అయితే స్మోకింగ్ జోన్ ఏరియాలో లేడీ కంటెస్టెంట్లు కనిపించే వారు. కానీ వారు దమ్ముకొట్టలేదు. కానీ ఈ సీజన్లో మహిళలు ఇంకాస్త ముందుకు వెళ్లారు.
సరయు, హమీద ఇద్దరూ కూడా లోబోతో కలిసి దమ్ము కొట్టేశారు. ఎంచక్కా ముగ్గురు పిచ్చాపాటిగా కబుర్లు చెప్పేసుకున్నారు. దమ్ముకొడుతూ అలా గాల్లో పొగలు ఊదేశారు. ఇంకా సిగరెట్లు అయిపోతాయేమో అని కొన్ని దాచుకున్నారు. అసలే ముగ్గురం ఉన్నాం.. సరిపోతాయో లేవో అని ముందు జాగ్రత్త పడ్డారు సరయు, హమీద. మొత్తానికి ఈ ఇద్దరు భామల కథ వేరేలా ఉంది. ఈ ఇద్దరిని జనాలు ఏ కోణంలో చూస్తారో మరి. ఇప్పటికైతే ఈ ఇద్దరి మీద ట్రోలింగ్ ప్రారంభం అయింది.