Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నారు. #SVP #SVPMania ట్యాగ్ లతో సర్కారు వారి పాట చిత్రం ట్రెండింగ్ అవుతోంది.
అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతోనే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సర్కారు వారి పాటతో స్టార్ట్ చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు. బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటించారు.
పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.మే 12 ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఇద్దరు కనుక వేదిక పంచుకుంటే అభిమానులకి పూనకాలు తప్పదు మరి. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ రెట్టింపు అంచనాలను నమోదు చేసింది.
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
This website uses cookies.