Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి స్టార్ హీరోనా.. ఇక పూన‌కాలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి స్టార్ హీరోనా.. ఇక పూన‌కాలే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 May 2022,6:30 pm

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నారు. #SVP #SVPMania ట్యాగ్ లతో సర్కారు వారి పాట చిత్రం ట్రెండింగ్ అవుతోంది.

అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతోనే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సర్కారు వారి పాటతో స్టార్ట్ చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు. బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటించారు.

sarkaru vaari paata chief guest pawan kalyan

sarkaru vaari paata chief guest pawan kalyan

Sarkaru Vaari Paata : ర‌చ్చ మాములుగా ఉండ‌దు..

పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.మే 12 ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కాబోతున్నార‌ని తెలుస్తుంది. ఇద్ద‌రు క‌నుక వేదిక పంచుకుంటే అభిమానుల‌కి పూన‌కాలు త‌ప్ప‌దు మ‌రి. బ్యాంకింగ్‌ స్కామ్‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ రెట్టింపు అంచనాల‌ను న‌మోదు చేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది