
Mahesh babu
Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మహేష్ బాబు కెరీర్ లో రాబోతున్న 27 వ సినిమా సర్కారు వారి పాట కాగా ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే నెలరోజుల దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ సినిమా గోవా లో ఒక సాంగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లేదా అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమాలో మహేష్ బాబు కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది.
Sarkaru Vaari Paata is not a solo movie
జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. యూనివర్సల్ పాయింట్ తో పరశురాం రూపొందిస్తుండగా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. అయితే ఈ ఇయర్ దాదాపు భారీ సినిమాలన్ని రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఈ ఏడాదిలో కాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలోనే సర్కారు వారి పాట సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. చెప్పాలంటే పెద్ద సినిమాలలో సొలోగా బరిలో దిగుతుందని భావించారు.
కాని అంత సీన్ లేదని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. మహేష్ బాబు సర్కారు వారి పాటకి పోటీగా డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ ల పీరియాడికల్ సినిమా, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – త్రివిక్రం ల పాన్ ఇండియన్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా ల లూసీఫర్ తెలుగు రీమేక్.. లాంటి భారీ సినిమాలే 2022 సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇయర్ లో ఉన్న రాధే శ్యాం, ఆచార్య, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలను దాటుకొని వచ్చే ఏడాదిలో సోలోగా వద్దామనుకున్న సర్కారు వారి పాట కి చుక్కెదురైనట్టే అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి 2022 లో సర్కారు వారి పాటకి ఏ ఏ సినిమాలు పోటీగా నిలుస్తాయో.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.