Sarkaru Vaari Paata : స్టేజ్ మీద అన్నని తలచుకొని కన్నీరు పెట్టుకున్న మహేష్ బాబు
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12న విడుదల కానుండగా, మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఈ ఈవెంట్‌లో మహేష్ ఎమోషనల్ అయ్యారు. ఒక రకంగా మహేష్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఈరెండేళ్లలో తనకు చాలా దగ్గరైన వాళు దూరమయ్యారంటూ.. అన్న రమేష్ బాబును తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ఒక దశలో ఆయన కళ్లల్లో నీళ్ళు కూడా తిరిగాయి. అయినా నేను ముందుకు వెళ్లడానికి మీ ప్రోత్సాహం చాలు అంటూ.. అభిమానుల సపోర్ట్ ను కోరుకున్నారు మహేష్. ఈ నెల 12న ఘన విజయాన్ని చూడబోతున్నాం అన్నారు.
మనమంతా ఇలాంటి కార్యక్రమం చేసుకుని రెండేండ్లవుతున్నది. డైరెక్టర్ పరశురామ్ ఒక్కడు సినిమా చూసి దర్శకుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. కాని ఈరోజు ఆయన నాకు, నా అభిమానులకు ఫేవరేట్ డైరెక్టర్ అయ్యాడు. ట్రైలర్ చూశాక మీరంతా ఎంత ఎంజాయ్ చేశారో, నేనూ అంతే ఆస్వాదించాను. చాలా హైలైట్స్ ఉంటాయి. హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ అందులో ఒకటి. కీర్తి సురేష్ పాత్ర సరదాగా సాగుతుంది. థమన్ మ్యూజిక్ సెన్సేషన్. మా మధ్య అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అన్నారు.
Sarkaru Vaari Paata mahesh babu emotional on stage
Sarkaru Vaari Paata : బాధతో మహేష్…
కళావతి పాట గురించి నేను డౌట్ పడితే.. తమన్ నమ్మకం ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ఈ పాటతో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడన్నారు మహేష్. ఇక మే 12న రిలీజ్ కాబోతున్న ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్, 14 రీల్స్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్.
