Sarkaru Vaari Paata : ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్కారు వారి పాట చిత్రం హంగామా కనిపిస్తుంది. మే 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు కొల్లగొట్టిన సర్కారు వారి పాట చిత్రం రానున్న రోజులలో మరింత అలరించనుందని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పట్టం కట్టారు.
పలువురు స్టార్స్ మూవీ వీక్షించి సినిమా అద్భుతంగా ఉందని కామెంట్ చేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి ఈ చిత్రాన్ని వీక్షించారు. వై.ఎస్.భారతి సర్కారు వారి పాట రివ్యూ కూడా ఇచ్చారు..మీడియాతో మాట్లాడుతూ.. మహేష్ బాబు సినిమాలంటే నాకు చాలా ప్రత్యేకమైనవని.. తప్పకుండా ఆయన సినిమాలు చూస్తానని తెలియజేశారు.. సర్కారు వారి పాట సినిమా చూశానని ఈ సినిమా చాలా బాగుందని ఫ్యామిలీ ఆడియన్స్ కు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు ముఖ్యంగా డబ్బు విషయంలో మహేష్ బాబు గారి యాక్షన్ చాలా బాగుందని ఆమె ప్రశంసలు కురిపించారు.
సర్కారు వారి పాట చిత్రంలో నాకు ఎంతో ఇష్టమైన డైలాగ్ మహేష్ బాబు పలకడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు.నేను ఉన్నాను నేను విన్నాను అనే డైలాగ్ సర్కారు వారి పాట ట్రైలర్ రావడంతోనే సినిమా పై హైప్ క్రియేట్ అయ్యింది. రీసెంట్‌గా కర్నూలులో సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో ఒక్కడు సినిమా షూటింగ్‌కు చాలా రోజుల క్రితం కర్నూలుకి వచ్చానన్నారు . రెండు రోజుల ముందు కర్నూలులో ఫంక్షన్ చేద్దామంటే సరే అన్నానని ఆయన చెప్పారు. కానీ ఇంతమంది వస్తారని నేను నిజంగా అనుకోలేదన్నారు మహేష్ బాబు. అందుకే నిజంగా ఫస్ట్ టైం మీకోసమే వచ్చి స్టేజ్ పై డాన్స్ కూడా వేశానన్నారు. ఇంతవరకు ఎక్కడా ఏ ఫంక్షన్‌లో కూడా డాన్స్ చేయలేదన్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.