Sayaji Shinde : ఒకప్పుడు 165 రూపాయలకు వాచ్‌మెన్‌గా.. ఇప్పుడు విలన్ కోట్లలో రెమ్యునరేషన్
Sayaji Shinde : ప్రముఖ నటుడు సాయాజీ షిండే జీవితం చాలా మందికి ప్రేరణగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన సాయాజీ.. తన కృషితో భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడు. పొలాల మధ్య పెరిగిన సాయాజీ, విద్య కోసం తన ఊరిని వదిలి సతారా నగరానికి చేరాడు. అయితే ఆ పరదేశంలో చదువుకోడానికి ఖర్చు తప్పదు.
Sayaji Shinde : ఒకప్పుడు 165 రూపాయలకు వాచ్‌మెన్‌గా.. ఇప్పుడు విలన్ కోట్లలో రెమ్యునరేషన్
అందుకే రాత్రిళ్లు వాచ్‌మెన్ గా పనిచేస్తూ, నెలకు కేవలం రూ.165 వేతనంతో జీవనం నడిపాడు. అదే సమయంలో తన అభిరుచిని చాటుకుంటూ నాటకాల్లోనూ పాల్గొన్నాడు.సాయాజీ నటనను గమనించిన నీల్ కులకర్ణి అనే నాటక దర్శకుడు అతనికి అవకాశం కల్పించాడు. ఆ తరువాత ముంబైకి వెళ్లి నటనలో శిక్షణ పొందాడు. చివరికి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టి ‘శూల్’ అనే సినిమాతో భారీ గుర్తింపు పొందాడు. ఇందులో బచ్చు యాదవ్ అనే పాత్రలో నటించిన సాయాజీ… తన బలమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
తొలి సినిమాతోనే పేరు తెచ్చుకున్న సాయాజీ.. ఆ తర్వాత వెనకడుగు వేసే ప్రసక్తే లేకుండా పోయింది. ఆయన హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, గుజరాతీ వంటి భాషల్లో పలు చిత్రాల్లో నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందాడు. సహాయ పాత్రలు, విలన్ పాత్రలు, ఘనమైన సంభాషణలు – అన్నిట్లోనూ తనదైన ముద్ర వేశాడు.సినిమాల్లో సత్తా చూపించిన సాయాజీ షిండే.. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు
Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి…
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…
Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
This website uses cookies.