Blood Group : భార్యాభర్తలకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే... వారికి పిల్లలు పుట్టరా... అసలు విషయం తెలిస్తే షాకే....?
Blood Group : చాలామంది చేసే పొరపాటు పెళ్లి చేసేటప్పుడు అన్ని తెలుసుకుని చేస్తారు. కానీ దంపతుల బ్లడ్ గ్రూప్ ని మాత్రం ఎవ్వరు కూడా పరీక్షించుకోరు.పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా మేనరికం పెళ్లిళ్లు చేసుకోకూడదు అనడం మనం వింటూనే ఉంటాం. కారణం వారి ఇద్దరి రక్తం ఒకే గ్రూపు అయి ఉంటుందని. అలా ఉంటే వారికి పుట్టే పిల్లలు అంగవైకల్యంగా పుడతారని అంటుంటారు. పిల్లలు సరిగ్గా పుట్టారని మనకి తెలుసు. అయినా కూడా కొందరు మూర్ఖత్వంతో అదే పని మరలా చేస్తూనే ఉంటున్నారు. అయితే, కేవలం మేనరికం ఉన్నంత మాత్రాన పిల్లల సరిగ్గా పుట్టారని అనుకుంటే పొరపాటే… ఏటువంటి రక్తసంబంధం లేని దంపతులకు కూడా ఒకే రకమైన బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నట్లయితే, వారికి కూడా పుట్టే సంతానంలో సమస్యలు రావచ్చు. లేదా సంతానం కలగకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దీని గురించి నిపుణులు ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందాం…
Blood Group : భార్యాభర్తలకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే… వారికి పిల్లలు పుట్టరా… అసలు విషయం తెలిస్తే షాకే….?
పెద్దలు వివాహాన్ని నిశ్చయించినప్పుడు, వివాహానికి ముందు రక్త పరీక్షలు ఉద్దేశం భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుటకు, ఇంకా జంటకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, వైవాహిక జీవితాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యం. అయితే మీరు పెళ్లయిన తర్వాత వీరి సంతానంలో ఎలాంటి ప్రమాదాలు కలగకుండా ముందు జాగ్రత్త పడి,ముందుగానే గుర్తించడానికి సహకరిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇంకా, సమర్థవంతంగా నిర్వహించడంలో కూడా ఉపయోగపడుతుంది. కొందరు దంపతులకు ఒకే బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నట్లయితే, వారికి పుట్టే సంతానం విషయంలో, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అన్న అపోహ తరచూ ప్రజలకు ఉంటుంది. వాస్తవానికి ఇది నిజం కాదు.ఒకే బ్లడ్ గ్రూపు ఉన్న జంటలకు సాధారణంగా బిడ్డను కనడంలో ఎటువంటి సమస్యలు ఉండవని సూచిస్తున్నారు వైద్యులు. ఓకే బ్లడ్ గ్రూపు ఉన్న బిడ్డలు గర్భం దాల్చడంలో ఎటువంటి సమస్య ఉండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్పెర్ము గుడ్డుపై బ్లడ్ గ్రూపు యాంటీజెండ్లు ఉండవు. అందువల్ల ఇది పిండం ఫలదీకరణం అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు. ప్రధాన సమస్య రక్త వర్గం Rh కారకానికి సంబంధించినది అలాగే ప్రధాన రక్త వర్గం( A,B, AB, O) కు సంబంధించినది కాదు.
Rh అనుకూలత సమస్య ఎప్పుడు మొదలవుతుంది
– కన్నతల్లి బ్లడ్ గ్రూపు Rh – నెగిటివ్, తండ్రి బ్లడ్ గ్రూపు Rh పాజిటివ్ ఉన్నట్లయితే, ఈ సమస్య వస్తుంది. ఈ పరిస్థితుల్లో శిశువు Rh- పాజిటివ్ అయితే,తల్లి శరీరం శిశువు రక్తాన్ని నెగిటివ్ గ్రూపుగా గుర్తించి, ప్రతి రోదకాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించవచ్చు.
. ప్రభావం : సాధారణంగా మొదటి గర్భాధారణ విషయంలో పెద్ద సమస్య ఏమి కాదు. కానీ, భవిష్యత్తులో గర్భధారణలో ఈ ప్రతిరోధకాలు శిశువు ఎర్ర రక్త కణాలను నశింపజేస్తాయి. దీనివల్లన RH అనుకూలత అనేది తీవ్రమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది.
. శిశువుపై ప్రభావం : ఇది శిశువులలో రక్తహీనత సమస్యను, ఇంకా, కామెర్లు లేదా కొన్ని సందర్భాలలో మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
. చికిత్స: ఎక్కువగా ఈ సమస్య తో ఇబ్బంది పడే వారికి,Rh- నెగిటివ్ గర్భిణీ స్త్రీలకు ఇచ్చే యాంటీ – డీ, ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్ ద్వారా సులభంగా నిర్వహించవచ్చు.
ఆహానికి ముందే వైద్యుల రక్త పరీక్షలు : వివాహం చేసుకోవాలి అనే ముందు రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా తలెత్తే ఆరోగ్య సమస్యలను గుర్తించి నివారించవచ్చు. దీని ప్రధాన రక్త గ్రూపు అనుకూలత కంటే చాలా ఎక్కువ.
పెళ్లికి ముందు రక్త పరీక్షలతో : తల సేమియా :
ఇది తీవ్రమైన రక్త రుగ్మత. తల్లిదండ్రులు ఇద్దరు తల సేమియాతో బాధపడుతున్నట్లయితే,వారి బిడ్డకు తల సేమియా మేజర్ వచ్చే అవకాశం 25% వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు.
. Rh గ్రూప్ అనుకూలత : పైన చెప్పినట్లుగా ఇది చాలా ముఖ్యమైన అంశాలలో ఒకటి. తల్లి Rh – నెగిటివ్, తండ్రి Rh- పాజిటివ్ అయితే శిశువు ఆరోగ్యం పై ప్రభావాలను నివారించడానికి ముందుగా దీనిని తెలుసుకోవడం ముఖ్యం.
. సికిల్ సెల్ అనిమియా :
ఇది జన్యుపరమైన రక్త రుగ్మత. ఇది వివాహానికి ముందు కూడా పరీక్షిస్తారు.
లైంగికంగా సంక్రమించే అంటవ్యాధులు :
HIV, హెపటైటిస్ -B, హెపటైటిస్-C, సిఫిలిస్, గోనేరియా మొదలైన ఇన్ఫెక్షన్లలో పరీక్షిస్తారు. తద్వారా వాటికి చికిత్స చేయవచ్చు. అంతేకాదు, భాగస్వామికి లేదా బిడ్డకు ఇన్ఫెక్షన్స్ ను వ్యాప్తి చెందకుండా కూడా నిరోధించవచ్చు.
సాధారణ ఆరోగ్య తనిఖీ :
ఏదైనా ఆరోగ్య సమస్యను గుర్తించాలంటే, హిమోగ్లోబిన్ స్థాయి, రక్తంలో చక్కెర, మూత్రపిండాలు, కాలేయ పనితీరు మొదలైన వాటి సాధారణ పరీక్షలు కూడా చేస్తారు.
దానికి ముందు రక్త పరీక్షలు చేయించడం భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం, ఇంకా ఆ జంటకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన,వైవాహిక జీవితాన్ని అందించడం. వారి జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. ఏదైనా ప్రమాదానికి ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరిస్తుంది. కాబట్టి, వివాహాన్ని నిశ్చయించే ముందు, మొదట రక్త పరీక్షలు చేయించి వారి భవిష్యత్తుని కాపాడాలి. వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించడంలో ఎటువంటి సందేహము ఉండవద్దు. తప్పు అసలు కాదు.
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…
Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
This website uses cookies.