Sayaji Shinde : ఒక‌ప్పుడు 165 రూపాయ‌ల‌కు వాచ్‌మెన్‌గా.. ఇప్పుడు విల‌న్‌ కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sayaji Shinde : ఒక‌ప్పుడు 165 రూపాయ‌ల‌కు వాచ్‌మెన్‌గా.. ఇప్పుడు విల‌న్‌ కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Sayaji Shinde : ఒక‌ప్పుడు 165 రూపాయ‌ల‌కు వాచ్‌మెన్‌గా.. ఇప్పుడు విల‌న్‌ కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్

Sayaji Shinde : ప్ర‌ముఖ న‌టుడు సాయాజీ షిండే జీవితం చాలా మందికి ప్రేరణ‌గా నిలుస్తుంది. మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన సాయాజీ.. తన కృషితో భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడు. పొలాల మధ్య పెరిగిన సాయాజీ, విద్య కోసం తన ఊరిని వదిలి సతారా నగరానికి చేరాడు. అయితే ఆ పరదేశంలో చదువుకోడానికి ఖర్చు తప్పదు.

Sayaji Shinde ఒక‌ప్పుడు 165 రూపాయ‌ల‌కు వాచ్‌మెన్‌గా ఇప్పుడు విల‌న్‌ కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్

Sayaji Shinde : ఒక‌ప్పుడు 165 రూపాయ‌ల‌కు వాచ్‌మెన్‌గా.. ఇప్పుడు విల‌న్‌ కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్

Sayaji Shinde చాలా మందికి ఆద‌ర్శం..

అందుకే రాత్రిళ్లు వాచ్‌మెన్‌ గా పనిచేస్తూ, నెలకు కేవలం రూ.165 వేతనంతో జీవనం నడిపాడు. అదే సమయంలో తన అభిరుచిని చాటుకుంటూ నాటకాల్లోనూ పాల్గొన్నాడు.సాయాజీ నటనను గమనించిన నీల్ కులకర్ణి అనే నాటక దర్శకుడు అతనికి అవకాశం కల్పించాడు. ఆ తరువాత ముంబైకి వెళ్లి నటనలో శిక్షణ పొందాడు. చివరికి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టి ‘శూల్’ అనే సినిమాతో భారీ గుర్తింపు పొందాడు. ఇందులో బచ్చు యాదవ్ అనే పాత్రలో నటించిన సాయాజీ… తన బలమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తొలి సినిమాతోనే పేరు తెచ్చుకున్న సాయాజీ.. ఆ తర్వాత వెనకడుగు వేసే ప్రసక్తే లేకుండా పోయింది. ఆయన హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, గుజరాతీ వంటి భాషల్లో పలు చిత్రాల్లో నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందాడు. సహాయ పాత్రలు, విలన్ పాత్రలు, ఘనమైన సంభాషణలు – అన్నిట్లోనూ తనదైన ముద్ర వేశాడు.సినిమాల్లో సత్తా చూపించిన సాయాజీ షిండే.. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది