Bigg Boss 8 Telugu : దిమ్మతిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ..!
Bigg Boss 8 Telugu : గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ గురించి నెట్టింట ఒకటే చర్చ నడుస్తుంది. ఎప్పుడు మొదలవుతుంది, కంటెస్టెంట్స్ ఎవరు, ఇలా అనేక వార్తలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఎట్టకేలకి బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలు కాగా, మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఏడు జంటలుగా అడుగుపెట్టిన వారు తమదైన శైలిలో గేమ్ ఆడుతూ రచ్చ చేస్తున్నారు.ఈ సీజన్‌లో అందరూ సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకున్న వారే కాబట్టి షో పై మరింత హైప్ పెరుగుతోంది. ఈసారి హౌస్‌లో కంటెస్టెంట్ల ఫార్మామెన్స్ ఎలా ఉండబోతుందంటూ గడిచిన ఒక రోజులోనే జనాల్లో నానా ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే.. ఈ షోకు యష్మీ గౌడ, అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ కంభం, ఆదిత్య ఓం,సోనియా, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, శేఖర్ బాష, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ విషయంలో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్‌కి కావాలనుకున్న వాళ్లు. రెండు.. బిగ్ బాస్‌కి వెళ్లాలనుకునే వాళ్లు. బిగ్ బాస్ కావాలనుకునేవాళ్లు అంటే.. వాళ్లకి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇస్తారు. కాస్త క్రేజ్ ఉన్న వాళ్లు మాకింత కావాలని డిమాండ్ చేస్తారు. వాళ్లతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలాడదు. వాళ్లతో కంటెంట్ వస్తుంది అనుకుంటే.. వాళ్లకున్న పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చేస్తుంటారు.
Bigg Boss 8 Telugu : దిమ్మతిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ..!
లీక్ అయిన సమాచారం ప్రకారం.. యాంకర్ విష్ణుప్రియ వారానికి రూ. 4 లక్షలు తీసుకోబోతుందట. అందరికంటే ఈమె పారితోషికమే ఎక్కువని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తర్వాత హీరో ఆదిత్య (3 లక్షల రూపాయలు), ఆదిత్య ఓం( రూ.3 లక్షలు), యష్మీ గౌడ(రూ.2.50), ఆర్జే శేఖర్ బాషా (రూ.2.50),నిఖిల్ మలియక్కల్ (రూ.2.25) నైనికా(రూ.2.20 లక్షలు), అభయ్ నవీన్(రూ.2 లక్షలు), కిరాక్ సీత, ప్రేరణ కంభం, నబీల్ అఫ్రీదీ(రూ.2 లక్షలు), సోనియా(రూ.1.50), బెజవాడ బేబక్క(రూ.1.50), పృథ్వీరాజ్(రూ.1.5)నాగ మణికంఠ(1.20 లక్షలు రూపాయలు). ఇందులో విష్ణుప్రియనే ఎక్కువగా పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ రాజ్ తక్కువ అందుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.