Bigg Boss 8 Telugu : దిమ్మ‌తిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యున‌రేషన్.. ఎవరికి ఎక్కువ‌, ఎవరికి త‌క్కువ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : దిమ్మ‌తిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యున‌రేషన్.. ఎవరికి ఎక్కువ‌, ఎవరికి త‌క్కువ‌..!

Bigg Boss 8 Telugu : గ‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ గురించి నెట్టింట ఒక‌టే చ‌ర్చ న‌డుస్తుంది. ఎప్పుడు మొద‌ల‌వుతుంది, కంటెస్టెంట్స్ ఎవ‌రు, ఇలా అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఎట్ట‌కేల‌కి బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబ‌ర్ 1న మొద‌లు కాగా, మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఏడు జంట‌లుగా అడుగుపెట్టిన వారు త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడుతూ ర‌చ్చ చేస్తున్నారు.ఈ సీజ‌న్‌లో అందరూ సోషల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 September 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : దిమ్మ‌తిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యున‌రేషన్.. ఎవరికి ఎక్కువ‌, ఎవరికి త‌క్కువ‌..!

Bigg Boss 8 Telugu : గ‌త కొద్ది రోజులుగా బిగ్ బాస్ గురించి నెట్టింట ఒక‌టే చ‌ర్చ న‌డుస్తుంది. ఎప్పుడు మొద‌ల‌వుతుంది, కంటెస్టెంట్స్ ఎవ‌రు, ఇలా అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఎట్ట‌కేల‌కి బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబ‌ర్ 1న మొద‌లు కాగా, మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఏడు జంట‌లుగా అడుగుపెట్టిన వారు త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడుతూ ర‌చ్చ చేస్తున్నారు.ఈ సీజ‌న్‌లో అందరూ సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకున్న వారే కాబట్టి షో పై మరింత హైప్ పెరుగుతోంది. ఈసారి హౌస్‌లో కంటెస్టెంట్ల ఫార్మామెన్స్ ఎలా ఉండబోతుందంటూ గడిచిన ఒక రోజులోనే జనాల్లో నానా ప్రశ్నలు తలెత్తున్నాయి.

Bigg Boss 8 Telugu ఎవ‌రికి ఎక్కువ‌..

ఇదంతా పక్కన పెడితే.. ఈ షోకు యష్మీ గౌడ, అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ కంభం, ఆదిత్య ఓం,సోనియా, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, శేఖర్‌ బాష, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్‌ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ విషయంలో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్‌కి కావాలనుకున్న వాళ్లు. రెండు.. బిగ్ బాస్‌కి వెళ్లాలనుకునే వాళ్లు. బిగ్ బాస్ కావాలనుకునేవాళ్లు అంటే.. వాళ్లకి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇస్తారు. కాస్త క్రేజ్ ఉన్న వాళ్లు మాకింత కావాలని డిమాండ్ చేస్తారు. వాళ్లతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలాడదు. వాళ్లతో కంటెంట్ వస్తుంది అనుకుంటే.. వాళ్లకున్న పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చేస్తుంటారు.

Bigg Boss 8 Telugu దిమ్మ‌తిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యున‌రేషన్ ఎవరికి ఎక్కువ‌ ఎవరికి త‌క్కువ‌

Bigg Boss 8 Telugu : దిమ్మ‌తిరిగేలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రెమ్యున‌రేషన్.. ఎవరికి ఎక్కువ‌, ఎవరికి త‌క్కువ‌..!

లీక్ అయిన సమాచారం ప్రకారం.. యాంకర్ విష్ణుప్రియ వారానికి రూ. 4 లక్షలు తీసుకోబోతుందట. అందరికంటే ఈమె పారితోషికమే ఎక్కువని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తర్వాత హీరో ఆదిత్య (3 లక్షల రూపాయలు), ఆదిత్య ఓం( రూ.3 లక్షలు), యష్మీ గౌడ(రూ.2.50), ఆర్జే శేఖర్ బాషా (రూ.2.50),నిఖిల్ మలియక్కల్ (రూ.2.25) నైనికా(రూ.2.20 లక్షలు), అభయ్ నవీన్(రూ.2 లక్షలు), కిరాక్ సీత, ప్రేరణ కంభం, నబీల్ అఫ్రీదీ(రూ.2 లక్షలు), సోనియా(రూ.1.50), బెజవాడ బేబక్క(రూ.1.50), పృథ్వీరాజ్(రూ.1.5)నాగ మణికంఠ(1.20 లక్షలు రూపాయలు). ఇందులో విష్ణుప్రియనే ఎక్కువగా పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ రాజ్ త‌క్కువ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది